‘ఆగడు’ చిత్రంలో తమన్నా పాత్ర ఏమిటంటే..?
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఆగడు'. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. మహేష్ బాబుతో పాటు తమన్నా కూడా ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుందని తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం.
ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన పోలీస్ స్టేషన్ సెట్లో మహేష్ బాబు, తమన్నాలపై సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో నటి నదియా మహేష్ బాబు అక్క పాత్రలో నటించబోతోందని తెలుస్తోంది. సినిమాలో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉండనుందని సమాచారం.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో 2011లో వచ్చిన 'దూకుడు' మంచి వినోదాత్మక చిత్రంగా పేరు తెచ్చుకోవడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మరో చిత్రం ఆగడు.
దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎంటర్టెన్మెంట్ విషయంలో 'ఆగడు' చిత్రం గతంలో తమ కాంబినేషన్లో వచ్చిన 'దూకుడు' చిత్రానికి డబల్ డోస్‌లా ఉంటుందని శ్రీను వైట్ల ఇప్పటికే స్పష్టం చేసారు. అందుకు తగిన విధంగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసిన వేసవి కానుకగా సినిమాను వచ్చే ఏడాది మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











