చలికి వణుకుతూ తమన్నా శాలువాలో (ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : అంతా వేడికి మగ్గిపోతుంటే తమన్నా ఏంటి ఎగస్ట్రాలు చేస్తోంది అనుకుంటున్నారా..అదేం కాదు..తమన్నా ప్రస్తుతం ఇండియాలో లేదు. తమన్నా విమానం ఎక్కేసి లడఖ్‌ వెళ్లిపోయింది. ఆమె నటిస్తున్న 'ఆగడు' చిత్రీకరణ ప్రస్తుతం లడఖ్‌లో జరుగుతోంది. దేశంలో ఇంత వేడి పెరిగినా అక్కడ మాత్రం చాలా చల్లగా ఉంటుంది. దీంతో రగ్గులు, దుప్పట్లు, షాలువా కప్పుకొని జనాలు తిరుగుతుంటారు. అలా శాలువాతో ఉన్న తన ఫొటో ట్విట్టర్‌లో పెట్టింది.

తమన్నా ట్వీట్ చేస్తూ.... ''వేసవిలో ఇలాంటి చలి ప్రదేశాల్లో చిత్రీకరణ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో.. ఈ ప్రదేశం నాకెంతో నచ్చింది'' అంటూ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం మహేష్‌బాబు సరసన 'ఆగడు'లో నటిస్తోంది తమన్నా.

తమన్నా మాట్లాడుతూ...'' హీరోయిన్ పాత్ర కథలో భాగంగా ఉండాలి అనుకోవడంలో తప్పులేదు. అలాంటి పాత్రలే పండుతాయి కూడా. వాటికి ప్రేక్షకుల ప్రశంసలు దక్కితే అదే పది వేలు. అవార్డుల్ని బోనస్‌గానే భావించాలి. వాటి కోసమే సినిమాలు చేయకూడదు. కొన్ని సినిమాలు అవార్డుల కోసం భారమైన కథా, కథనాలతో వండేస్తారు. అలాంటి సినిమాల్లో కళాత్మక విలువలు ఉంటే ఫర్వాలేదు. కేవలం ప్రేక్షకుల్ని ఏడిపిస్తే అవార్డులొస్తాయనుకొంటారు. అలాంటి సినిమాల్లో నేను నటించలేను. కాస్త గ్లామర్‌, కాస్త నటన కలబోసిన పాత్రలు చాలు. అంతిమంగా సినిమా బాగుండాలి. దాని వల్ల నిర్మాతలకు నాలుగు డబ్బులు రావాలి అంతే'' అని చెప్పుకొచ్చింది తమన్నా.

అలాగే పురస్కారాలు అందించే ఆనందం వేరు. పారితోషికం జేబు నింపితే.. అవార్డు మనసు నింపుతుంది. అందుకే ఒక్కసారైనా అలాంటి అరుదైన గుర్తింపు సొంతం చేసుకోవాలని తారాలోకం తహతహలాడుతుంటుంది. కానీ.. తమన్నా మాత్రం 'అవార్డుల కోసం నేనెప్పుడూ ఆశపడలేదు. వాటి కోసమే సినిమాలు చేయాలనుకోవడం తప్పు' అంటోంది.

Tamanna at Agadu song shoot Ladakh

'ఆగడు' చిత్రం తో బిజీగా ఉన్న తమన్నా మరో చిత్రం సైన్ చేసింది. సురేంద్రరెడ్డి దర్సకత్వంలో రూపొందనున్న కిక్ చిత్రం సీక్వెల్ ని ఆమె ఓకే చేసిందని తెలుస్తోంది. కిక్ 2 లో రవితేజ సరసన ఆమె అల్లరి చేసే పాత్రలో కనిపించనుంది. వీరిద్దరి రొమాన్స్ తొలిసారి కావటంతో మంచి ఎక్సపెక్టేషన్స్ ఉండే అవకాసం ఉంది.

తమన్నా నటిస్తున్న హిందీ చిత్రాలు 'హమ్‌ షకల్స్‌' ప్రచార చిత్రాలు ఇటీవల విడుదలయ్యాయి. వాటికి వస్తున్న స్పందన చూసి ''హమ్‌ షకల్స్‌' ప్రచార చిత్రాలు చూసి 'నువ్వ చాలా అందంగా ఉన్నావ్‌'అంటూ అందరూ కామెంట్‌ చేస్తున్నారు. ఈ మాటలు వింటుంటే ఎంత బాగుందో'' అంటూ మురిసిపోతోంది. ఆమె నటించిన 'ఇట్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌' ఫస్ట్‌లుక్‌ కూడా ఇటీవల విడుదలైంది. ఇందులో సింహాసనం మీద కుక్క కూర్చోగా.. పక్కన కుక్క ఫోజులో అక్షయ్‌ కుమార్‌ కూర్చొని ఉన్నారు. ఇది కూడా అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X