'హ్యాపీడేస్' తర్వాత నచ్చిన చిత్రం తమన్నా
'హ్యాపీడేస్' తర్వాత తనకి అన్నివిధాలా 'ఆవారా' బాగా నచ్చిందనీ, తన పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనీ తమన్నా తెలిపారు. ఆమె తమిళ నటుడు కార్తీ సరసన చేసిన తమిళం చిత్రం పయ్యా' చిత్రం తెలుగులో 'ఆవారా'గా మే 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్బంగా దర్శక, నిర్మాతలు ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఇక హీరో కార్తీ మాట్లాడుతూ "నా మునుపటి సినిమా 'యుగానికి ఒక్కడు'ని తెలుగువాళ్లు ఆదరించిన తీరు అపూర్వం. వాళ్ల ఆదరాభిమానాల్ని మరింతగా పొందాలనే తపనతో ఈసారి 'ఆవారా'గా వస్తున్నా. స్ట్రయిట్ సినిమా తరహాలో ఈ సినిమా డబ్బింగ్ పనులు జరిపాం. లింగుస్వామి దర్శకత్వం, యువన్ శంకర్ సంగీతం ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్స్" అన్నారు.
దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ "ఇదివరకు నేను డైరెక్ట్ చేసిన 'పందెంకోడి' సినిమా తెలుగులో ఘన విజయం సాధించింది. అలాగే 'ఆవారా' అంతకుమించి సక్సెస్ అవుతుందనే నమ్మకముంది' అని చెప్పారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ "తమిళంలో ఈ సినిమాకి ఘన విజయం చేకూర్చి పెట్టారు ప్రేక్షకులు. తెలుగులో ఆడియోకు వచ్చిన స్పందన చూస్తుంటే ఇక్కడ కూడా సినిమా పెద్ద హిట్టవుతుందనే నమ్మకం కలుగుతోంది. 'యుగానికి ఒక్కడు'గా ఇటీవలే తెలుగు ప్రేక్షకుల ఆదరాన్ని పొందిన కార్తీ 'ఆవారా'గా వాళ్లని మరింత ఆకట్టుకుంటాడు" అని చెప్పారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కె. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు ఇప్పటికే విడుదల అయ్యాయి.


Click it and Unblock the Notifications











