మహేష్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోతున్న100% లవ్ హీరోయిన్..!

By Sindhu

మహేష్ తో సుకుమార్ డైరెక్షన్ లో 'దూకుడు" చిత్ర నిర్మాతలు ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్ ని సుకుమార్ లెక్చరర్ గా చూపించబోతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నాను ఖరారు చేసినట్టు సమాచారం. ఆమధ్య తను రూపొందించిన '100% లవ్' సినిమా ద్వారా కథానాయిక తమన్నాకు టాలీవుడ్ లో ఓ ఊపు తెచ్చిన దర్శకుడు సుకుమార్, తన తదుపరి చిత్రంలో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటున్నాడు.

'100% లవ్" చిత్రంలో మహాలక్ష్మీ గా నటించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసేసిన తమన్నా టాలెంట్ కి సరెండరైపోయిన దర్శకుడు సుకుమార్ తన దర్శకత్వంలో రెండవసారి ఈ అవకాశాన్ని ఆమెకు ఇస్తున్నాడు. మహేష్ సరసన తమన్నాకు ఇది తొలి సినిమా అవుతుంది. ఇటీవల 'దూకుడు' సూపర్ హిట్ సినిమాను నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించే ఈ సినిమా షూటింగు వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది.

ఇప్పటికే రామ్ చరణ్, రామ్, ప్రభాస్ ల చిత్రాల్లో నటిస్తున్న తమన్నా చేతిలో మహేష్ చిత్రం కూడా చేరడంతో తెలుగులో తమన్నా హవా ఎక్కువైనట్లుంది...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X