»   » నేను డీప్ లవ్‌లో ఉన్నానంటూ బురిడీ కొట్టించిన తమన్నా!

నేను డీప్ లవ్‌లో ఉన్నానంటూ బురిడీ కొట్టించిన తమన్నా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీలో చాలా తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది కానీ... ఆశించిన స్థాయిలో ఆమె కెరీర్ సాగడం లేదు. సౌతిండియాలో నెం.1 స్టార్ హీరోయిన్ గా వెలుగొందాలని ఉబలాట పడే తమన్నా మీడియా ఎదురుపడితే వారిని బురిడీ కొట్టించే మాటలు మాట్లాడటం అలవాటు చేసుకుంది.

ఇటీవల ఓ ప్రెస్ మీట్లో తన జర్నలిస్టు ఫ్రెండ్స్ ను తృప్తి పరిచేందుకు నేను డీప్ లవ్ లో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. అయితే వెంటనే మాట మార్చి నేను నా వర్క్ తో డీప్ లవ్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. తనను నుండి ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ రాబట్టాలనే జర్నలిస్టులకు తనదైన రీతిలో ఝలక్ ఇచ్చింది.


Tamanna Bhatia Admits She Is In Deep Love

తమన్నాను ఇంటర్వ్యూ చేయడానికి తరచూ ఎవరో ఒకరు వస్తుంటారు. వారు తొలుత ఆమె సినిమాల గురించి అడగటం మొదలు పెట్టి......మెల్లిగా ప్రేమ, పెళ్లి అంశాలపై ఆమె నుండి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయని ముందే ఊహించే తమన్నా సమాధానాలు రెడీ చేసుకుని పెట్టుకుంటోంది.


ప్రేమ అంశం గురించి అడగ్గానే...అవును, నేను ప్రేమలో ఉనప్నాను, నా ఫ్యామిలీ...ప్రొఫెషన్ ను చాలా ప్రేమిస్తాను. నా కెరీర్లో ఎదగడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. దీనికే మాకు సమయం సరి పోవడం లేదు. ఇక బాయ్ ఫ్రెండ్స్ తో రొమాన్స్ చేసే సమయం ఎక్కడిది అంటూ గడుసుగా మాట్లాడుతోంది తమన్నా.

English summary
Tamannaah Bhatia finally confesses that she is in deep love. Probably the only non controversial actress we have in T town admits her love. Before breaking your hearts and cry an ocean, read the entire story.
Please Wait while comments are loading...