పెళ్లి చేసుకోమంటూ తమన్నా వెంటపడ్డ అసిస్టెంట్ డైరెక్టర్లు!
ముంబై: సౌతిండియా చిత్ర సీమను తన అందాలతో ఓ ఊపు ఊపిన హీరోయిన్ తమన్నా... ప్రస్తుతం బాలీవుడ్లో నిలదొక్కుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమ్మడు అజయ్ దేవగన్‌తో కలిసి 'హిమ్మత్ వాలా' చిత్రంలో నటిస్తోంది. బాలీవుడ్‌లో ఇతర హీరోయిన్ల పోటీని తట్టుకునేందుకు తన గ్లామర్ దుకాణం కాస్త ఎక్కువగానే ఓపెన్ చేసింది తమన్నా.
తమన్నా అందం ఆమెకు ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆమె ముందు పెళ్లి ప్రపోజల్స్ పెడుతున్నారట. ఇటీవల 'హిమ్మత్ వాలా' షూటింగ్ సెట్లో పని చేసే ఐదుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు తమన్న వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోమని అడిగారట. కానీ వారి ప్రపోజల్ తిరస్కరించింది తమన్నా.
ఒకేసారి ఐదుగురు అసిస్టెంట్ డైరెక్టర్లు ఇలా చేయడంతో ఆమెకు ఎక్కడో అనుమానం కలిగింది. ఇదంతా తనను ఆటపట్టించడానికే అని గ్రహించిన ఆమె....ఆ చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్ కావాలనే ఫన్ కోసం ఇదంతా చేయించారని తెలుసుకుని ఆశ్చర్య పోయింది.
ఈ ప్రపోజల్స్ పై ఆమె ఎలా స్పందించారు అనేది స్లైడ్ షోలో..

తొలుత ఇద్దరు వచ్చి ఈ ప్రపోజల్ చేసినప్పుడు తమన్నా స్పోర్టివ్ గా స్పందించింది.

మూడో వ్యక్తి కూడా వచ్చి ఇదే ప్రపోజల్ చేయడంతో అనుమానం వచ్చిన తమన్నా... ఇదంతా తనను ఆటపట్టించడానికే అని అర్థం చేసుకుంది.

1983లో వచ్చిన హిమ్మత్ వాలా చిత్రానికి రీమేక్ గా అదే పేరుతో మళ్లీ తెరకెక్కిస్తున్నారు. ఈచిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా వాసు భగ్నాని, యూటీవీ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

వాస్తవానికి హిమ్మత్ వాలా సినిమాకు మూలం టాలీవుడ్లోనే ఉంది. తెలుగులో కృష్ణ,జయప్రద జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊరికి మొనగాడు' చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది.

అదే సినిమాను పద్మాలయా సంస్థ హిందీలో 'హిమ్మత్ వాలా' పేరుతో 1983లో తెరకెక్కించింది. ఇందులో జితేంద్ర, శ్రీదేవి నాయకానాయికలుగా నటించారు.


Click it and Unblock the Notifications











