శృంగార సీన్ల గురించి తమన్నా ఆసక్తికర కామెంట్స్
హైదరాబాద్: హీరోయిన్ తమన్నా సినిమాల్లో శృంగార సంబంధమైన సీన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అలాంటి సీన్లు చేస్తున్నపుడు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ మ్యాచ్ అవ్వాలని, అప్పుడే సీన్లు పండుతాయని అంటోంది ఈ మిల్కీ బ్యూటీ. రియల్‍గా ఫీలవుతేనే సీన్ పర్‌ఫెక్టుగా వస్తుందని చెప్పకనే చెప్పింది.

చూసే ఆడియన్స్ కూడా శృంగార సీన్లు.....ఆర్టిస్టులు రియల్‌గా చేస్తున్నారనే ఫీల్ కావాలని, అప్పుడే మంచి ఫీల్ వస్తుందని తమన్నా చెప్పుకొచ్చింది. రొమాంటిక్ సీన్లు చేసేప్పుడు ఆర్టిస్టులు చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. చాలా మంది టెక్నీషియన్స్, ఇతర వ్యక్తుల చుట్టూ ఉండగా అలాంటి సీన్లు చేసేపుడు ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని తమన్నా తన మనసులోని మాటను బయట పెట్టింది.
ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే....
ప్రస్తుతం తమన్నా చేతిలో పెద్దగా సినిమాలేవీ లేవు. రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి' చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటిస్తోంది. ఆర్య హీరోగా తెరరెక్కుతున్న ఓ తమిళ చిత్రంలో కూడా తమన్నా హరోయిన్‌గా సేస్తోంది. ఈ చిత్రానికి ఎం రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











