»   » హాట్ తమన్నా స్కిన్ షో వృధా కాలేదు

హాట్ తమన్నా స్కిన్ షో వృధా కాలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగులో దాదాపు యంగ్ హీరోలందరితో చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన,తమన్నాకి బాలీవుడ్ ని ఏలాలనేది కల. అయితే అక్కడ ఆమె ఎంట్రీ సవ్యంగా సరిగ్గా జరగలేదు. ఆమె నటించిన హిమ్మత్ వాలా రీమేక్ పెద్ద డిజాస్టర్ అవటంతో అంతా అక్కడ ఆమె పని అయిపోయిందనుకున్నారు. అయితే చిత్రంగా అక్కడ ఆమెకు పెద్ద హీరోల సరసన ఆఫర్స్ వస్తున్నాయి. దాంతో ఆమె చాలా సంతోషంగా ఉంది. హిమ్మత్ వాలాకు ఆమె చేసిన డాన్స్, స్కిన్ షో వృధా కాలేదంటున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ సరసన ఎంటర్టైన్మెంట్ అనే చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఫర్హాడ్ -సాజిద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రమేష్ ఎస్ తౌరని నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయంపై తమన్నా చాలా నమ్మకం పెట్టుకుంది. అలాగే సైఫ్ అలీఖాన్‌కి జోడీగా హమ్ షకాల్ అనే మరో చిత్రంలో తమన్నా ఖరారైందని విశ్వసనీయ సమాచారం. సినిమాలో మరొక నటి ఇషా గుప్త కూడా నటించనుంది. ఈ చిత్రాలే కాకుండా ఖరారు కాని ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయని,ఆమె దృష్టి పూర్తిగా అక్కడే కాన్సర్టేట్ చేసిందని అంటున్నారు.

దక్షిణాన సూపర్ హిట్ సినిమాలలో నటిచిన తమన్నా బాలీవుడ్ లో ' హిమ్మత్ వాలా' సినిమాతో అడుగుపెట్టింది. కాని తమన్నా దురదృష్టం ఈ సినిమాకి ప్రజల నుండి ఆదరణ లబించలేదు. తమన్నా చేసిన పాత్ర పై కూడా విమర్శలు వస్తున్నాయి. అప్పటి సినిమాలో నటించిన శ్రీ దేవీ అంత గ్లామర్ గా, పవర్ ఫుల్ గా తన పాత్ర లేదని అన్నారు. తెలుగులో నాగ చైతన్య హీరోగా చేసిన'తడాఖా' లో తమన్నా చేసింది. ఆ సినిమా ఓకే అనిపించుకుంది. కానీ తర్వాత తెలుగులో ఏ సినిమాలూ ఆమె ఒప్పుకోలేదు.

మరో ప్రక్క తమన్నా కి తెలుగులో ఆఫర్స్ లేకపోయినా తమిళంలో వెలిగిపోతోంది. అక్కడ ఆమె రెండు కోట్లు దాకా డిమాండ్ చేస్తోంది. కార్తీ నటించిన 'సిరుతై' తరువాత తమిళ సినిమాలకు కాస్త బ్రేకిచ్చేసింది తమన్నా. ఆ సినిమా తరువాత తమిళ చిత్రసీమవైపు చూడని ఈ ముద్దుగుమ్మ కొంత గ్యాప్ తరువాత ప్రస్తుతం అజిత్ హీరో గా నటిస్తున్న 'వీరమ్' చిత్రంలో నటిస్తోంది. తెలుగు సినిమాలకు కోటి ఇరవై లక్షలు తీసుకుంటున్న ఈ భామ అజిత్ సినిమా కోసం ఏకంగా రెండు కోట్లు పారితోషికం తీసుకుంటోందని చెన్నై చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో నాగచైతన్య తో చేసిన 'తడాఖా' తరువాత కాస్త జోరు తగ్గించిన ఈ సుందరి హిందీలో మాత్రం స్పీడు పెంచేసింది.

English summary
Tamannah has shifted focus to Bollywood.Presently she has two Hindi films in hand. One is opposite Akshay Kumar. The film has been titled as Entertainment. The other film is Humshakal opposite Saif Ali Khan. So lady Tamannah is all busy with her Bollywood projects. She forayed into Bollywood with the film Himmatwala. The film sank without any trace. But it did open up doors for Tamannah. All that skin show and fab dance moves did not go waste.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X