అనుభవపూర్వకంగా తమన్నా..
హ్యాపీ గర్ల్ తమన్నా ఇప్పుడు ప్రతి విషయం పైనా మాట్లాడేస్తోంది. తాజాగా తన పై వస్తున్న రూమర్స్ పై స్పందిస్తూ ఈ విధంగా చెప్పుకోచింది. "సినిమాల్లో హీరోయిన్ అంటే కథానాయికలంటే ప్రతివారికీ చులకన భావం ఉంటుంది. వారి గురించి ఏది పడితే అది రాసేస్తుంటారు. ఆ రూమర్ లు చదివి కుటుంబ సభ్యులు డీలా పడితే ఇంకేముంది? కెరీర్ అంతటితో ఆగినట్టే! ఈ విషయంలో మా నాన్నను ఎంతో మెచ్చుకోవాలి. అలాంటివాటిని పట్టించుకోవద్దని ఆయనే నాకు చెబుతుంటారు. నా ప్రతి విజయానికి కారణం నాన్నే. నీకేం భయం లేదు..మేమున్నామంటూ వెన్నుతట్టేవారుంటే ఎంతటి కష్టాన్నైనా సులువుగా అధిగమించవచ్చు. జీవితంలో పైకెదగడానికి స్వశక్తితో పాటు మన శ్రేయోభిలాషుల మాటలు కూడా తోడ్పడతాయి. ఇది నేను అనుభవపూర్వకంగా చెబుతున్న మాట" అని అంటోంది.సర్లే గాని నీ బీర్ ల త్రాగుడు సంగతేంటి అంటే మాత్రం నో కామెంట్స్ అని తప్పించికుంది.


Click it and Unblock the Notifications











