»   » ఏ అబ్బాయితోనూ ఆ అనుభవం లేదు: తమన్నా

ఏ అబ్బాయితోనూ ఆ అనుభవం లేదు: తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మిల్కీ బ్యూటీగా సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తారామణుల్లో తమన్నా ఒకరు. అమ్ముడు సినిమాల్లోకి అడుగు పెట్టి అప్పుడే దశాబ్ద కాలం గడిచి పోయింది. వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమ గురించి అడిగిన ప్రశ్నలకు తమన్నా సమాధానాలు ఇచ్చింది.

తాను ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో పడలేదని, ఏ అబ్బాయితోనూ డేటింగ్ అనుభవం కూడా లేదని చెబుతోంది. ఒక వేళ తనకు ప్రేమించాలనే ఆలోచన వచ్చి ఉంటే ఎవరో ఒకరు నచ్చే వారేమో? కానీ నాకు ఇప్పటి వరకు అలాంటి ఆలోచన రాలేదు. అంత ఆలోచించే సమయం నాకెక్కడ ఉంది? అంటూ ప్రశ్నిస్తోంది. ప్రేమ, డేటింగ్ లాంటి అనుభవాలు బావుంటాయనే అనుకుంటున్నాను. కానీ ప్రస్తుతం నన్ను నేను, నా ప్రేమను సినిమాలకు అంకితం చేసేశా అని తమన్నా చెప్పుకొచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Tamanna completes one decade in the film industry!

ప్రస్తుతం తమన్నా రవితేజ సరసన ‘బెంగాల్ టైగర్' చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం బాహుబలి చిత్రంలో కూడా నటిస్తోంది. అయితే గతంతో పోలిస్తే తమన్నాకు తెలుగులో అవకాశాలు కాస్త తగ్గాయి. ఆమె నటించిన గత చిత్రాలు ‘ఆగడు' చిత్రం ప్లాపు కావడంతో పాటు హిందీలో ఆమె నటించిన రెండు చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. అందుకే తమిళ సినీ పరిశ్రమపై దృష్టి సారించింది.

బక్క పలుచగా ఉంటే తమిళంలో అవకాశాలు దక్కించుకోవటం కష్టమే. కాస్త బొద్దుగా ఉండే భామలకే అక్కడ ప్రాధాన్యత. ఈ విషయాన్ని గ్రహించిన తమన్నా ప్రస్తుతం బరువు పెరిగే పనిలో ఉంది. ఇటీవలో ఓ ఫంక్షన్లో తమన్నా కాస్త లావెక్కి కనిపించిందని తెలుస్తోంది. సినిమా అవకాశాల కోసం ఆమాత్రం కష్ట పడాల్సిందే మరి!

    English summary
    Beautiful actress Tamanna has completed 10 years of her acting career in the industry. She made her acting debut in the Bollywood film Chand Sa Roshan Chehra in the year 2005 and also appeared in Abhijeet Sawant album song Lafzon main from the album Aapka Abhijeet which was released in the year 2005.
    Please Wait while comments are loading...