స్టార్ హీరోతో తమన్నా బాలీవుడ్ ఎంట్రీ ఖరారు
మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ దర్శకత్వంలో రూపొందబోతున్న 'హిమ్మత్ వాలా' చిత్రంలో అజయ్ దేవగన్ సరసన హీరోయిన్‌గా ఎంపికయింది. చాలా మందిని సంప్రదించిన తర్వాత దర్శకుడు చివరకు తమన్నాను తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఓ మీడియా ఇంటర్య్వూలో మాట్లాడుతూ తమన్నా ఈవిషయాన్ని స్పష్టం చేసింది.
జితేంద్ర, శ్రీదేవి జంటగా 80ల్లో వచ్చిన'హిమ్మత్ వాలా' చిత్రం అప్పుడు సంచలన విజయం సాధించింది. ఆ చిత్రాన్ని అదే పేరుతో అజయ్ దేవగన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈచిత్రం ద్వారా తన బాలీవుడ్ ఎంట్రీ అదురుతుందని తమన్నా ఆశిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీడేస్' చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన తమన్నా ఆ తర్వాత పెద్ద స్టార్లతో వరుస అవకాశాలతో సౌత్‌లో ప్రముఖ హీరోయిన్ గా మారింది.
దక్షిణాదిన ఉన్న అందరూ స్టార్ హీరోలతోనూ తమన్నా నటించింది. ప్రస్తుతం ఆమె రామ్‌తో కలిసి నటించిన 'ఎందుకంటే ప్రేమంట' చిత్రం రేపు'జూన్ 8' విడుదల కాబోతోంది. మరో వైపు ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'రెబెల్' చిత్రంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రంలోనూ తమన్నా నటిస్తోంది.
సాధారణంగా దక్షిణాదిన పాపులర్ అయిన హీరోయిన్లంతా బాలీవుడ్ వైపు అడుగులు వేయడం జరుగుతోంది. అయితే అందులో కొంత మంది మాత్రమే బాలీవుడ్‌లో రాణించ గలుగుతున్నారు. సరైన బ్రేక్ లభించని వారంతా తిరిగి దక్షిణాది సినిమాల వైపే వచ్చేస్తున్నారు. మరి ఈ ముంబై భామ భవిష్యత్ ఎలా ఉందో..?


Click it and Unblock the Notifications











