సుకుమార్ తో నిజమే..తమన్నా
సుకుమార్ చిత్రంలో తమన్నాకి ఆఫర్ ఇచ్చారనే వార్తలు కరెక్టేనని కన్ఫర్మ్ చేసింది తమన్నా. సుకుమార్ త్వరలో తీయనున్న హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో తమన్నాని హీరోయిన్ గా ఎంపిక చేసాడని చెప్తోంది. అసలు అంతా తమన్నాని ఆర్య-2లో తీసుకుంటాడని చెప్పుకున్నారు. అయితే ఆ అవకాశం ఆమెకు మిస్సయినా ఆమె కెరీర్ లో నిలబడి పోయే ఆఫర్ ఇదేనని అంటున్నారు. ఇక ఈ చిత్రం తన పాత్ర చుట్టూనే తిరుగుతుందని గొప్పగా చెప్తోంది తమన్నా. అయితే కొందరు అనుకుంటున్నట్టు ఈ చిత్రం 'అరుంధతి' లాంటి సోషియో ఫాంటసీ మాత్రం కాదనీ, అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాగానే ఉంటుందనీ ఆమె తెలిపారు.
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల వల్ల నటిగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుందనీ, అలాంటి అవకాశం రావడం సంతోషంగా ఉందనీ తమన్నా చెప్పింది. సబ్జెక్ట్ గురించి చెప్పేందుకు మాత్రం నిరాకరించింది. అలాగే తాను రెమ్యునరేషన్ విపరీతంగా పెంచుకుంటూ పోతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తెలిపింది. స్క్రిప్టు ఎంత బాగుందనే విషయానికే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తాననీ, మిగతావన్నీ ఆ తర్వాతేననీ చెప్పుకొచ్చింది. తన పనికి తగ్గ పారితోషికాన్నే తాను తీసుకుంటానని చెప్తోంది.


Click it and Unblock the Notifications











