»   » 2 గంటలకు...20 లక్షలు అడుగుతున్న తమన్నా

2 గంటలకు...20 లక్షలు అడుగుతున్న తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓ వైపు తెలుగు, తమిళ చిత్రాలు...మరో వైపు హిందీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్న తమన్నా తనకున్న పాపులారిటీకి ఏమాత్రం తగ్గకుండా నిర్మాతల నుండి ముక్కుపిండి మరీ భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తుందనేది ఇండస్ట్రీ వర్గాల మాట. డబ్బు విషయంలో ఆమె మహా మొండిఘటం అని అంటుంటారు.

డబ్బు విషయంలో తమన్నా ధోరణి ఎలా ఉంటుందో మరోసారి తేటతెల్లమైంది. ఇటీవల ఓ తమిళ సినిమాలో గెస్ట్‌రోల్ కోసం....నిర్మాతలు ఆమె నుండి 2 గంటల కాల్ షీట్స్ తీసుకోవడం కోసం సంప్రదించారు. ఇందుకు గాను తమన్నా రూ. 20 లక్షల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

Tamanna demanding huge remuneration !

తమిళ నిర్మాత, నటుడు ఉదయనిధి స్టార్ హీరోగా తెరకెక్కుతున్న 'నాన్‌బెండ' అనే చిత్రం కోసం ఈ గెస్ట్ రోల్ చేయమని అడిగారట. ఈ సినిమాలో ఆమె గెస్ట్‌రోల్ ఎంతో ఇంపార్టెంట్ కావడంతో....తమన్నా అడిగిన రూ. 20 లక్షల మొత్తాన్ని ఇవ్వడానికి నిర్మాతలు అంగీకరించినట్లు సమాచారం.

అయితే...ఈ మాత్రం దానికే తమన్నా రూ. 20 లక్షలు తీసుకోవడం ఇపుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో బాహుబలి, ఆగడు చిత్రాలతో పాటు, హిందీలో హమ్ షకల్స్....తమిళంలో బాస్ ఎంగిరా భాస్కరన్ 2 అనే చిత్రంలో నటిస్తోంది.

English summary
Tamil hero/producer Udayanidhi Stalin is acting in a new film titled Nanbenda and he has approached Tamannah for a small yet pivotal role in the film. Knowing the importance of her role, Tamannah is said to have asked for 20 lakhs for 2 hours and the producers were said to have readily agreed to her demand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu