twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐటం సాంగు చేయబోతున్న హీరోయిన్ తమన్నా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఐటం సాంగులు చేసే హీరోయిన్ల లిస్టులో ఇపుడు తమన్నా కూడా చేరబోతోంది. తమన్నా ఏమిటి..? ఐటం సాంగ్ చేయడం ఏమిటి? అని మీరే కాదు....మేమూ ఆశ్చర్య పోయాం. ఫిల్మ్ నగర్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో ఆమె ఐటం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు శ్రీనివాస్ ఈచిత్రం ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. సమంత హీరోయిన్. కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న చిత్రం కావడం బెల్లంకొండ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు.

    Tamanna to do a Item song

    వీలైనన్ని ఎక్కువ హంగులు సినిమాలో చూపెట్టేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నాడు. అందులో భాగంగానే హీరోయిన్ తమన్నాకు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఆమెను ఒప్పించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమెపై ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగబోతున్నట్లు తెలుస్తోంది.

    యాక్షన్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈచిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు. బ్రహ్మానందం కామెడీ సినిమాకు మరో హైలెట్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

    English summary
    V V Vinayak’s upcoming film starring Bellamkonda Sreenivas and Samantha is slated for release later this year. The latest buzz in Filmnagar is that Bellamkonda Suresh has roped in Tamanna in this film for Item song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X