తమన్నా తడిసిన అందాల ‘తడాఖా’(ఫోటో ఫీచర్)
హైదరాబాద్: సౌతిండియాలోని సెక్సీ హీరోయిన్లలో తమన్నా ఒకరు. మిల్కీ బ్యూటీలా మిలమిలా మెరిసిపోయే తమన్నా అందాలు వానలో తడిసాయంటే ఆ అందాలను మాటల్లో వర్ణించడం కాస్త కష్టమే. ఇప్పటికే పలు చిత్రాల్లో తమన్నా తడిసిన అందాలతో అభిమానుల మతి పొగొట్టింది.
తమన్నా మరోసారి తన తడిసిన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించబోతోంది. నాగచైతన్యతో చేయబోతున్న 'తడాఖా' సినిమాలో ఆమె వాన పాటలో నటించబోతోంది. తమిళంలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిచన 'వెట్టై' చిత్రానికి రీమేక్‌గా 'తడాఖా' చిత్రం రూపొందుతోంది.
'తడాఖా' చిత్రానికి తెలుగులో కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా నాగచైతన్య, తమన్నా, సునీల్, ఆండ్రియా జెర్మయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య, సునీల్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు. సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తమన్నా గతంలో రచ్చ, ఆవారా చిత్రంలో వానపాటల్లో నటించి తన అందచందాలతో ప్రేక్షకులకు మంచి కిక్కెక్కించింది. తాజాగా తడాఖా చిత్రంలో కూడా తమన్నా అదే రేంజిలో రెచ్చిపోతుండటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని దర్శకనిర్మాతలు నమ్ముతున్నారు. త్వరలో ఈచిత్రం విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

తమన్నా ‘రచ్చ' చిత్రంలో వాన వాన వెల్లువాయె పాటల్లో సెక్సీగా అందాలు ఆరబోసిన విషయం తెలిసిందే.

మిల్కీ బ్యూటీ ఇలా వానలో తడిస్తే అభిమానులకు అందాల విందు కాకుంటే మరేమిటి?

బద్రీనాథ్ చిత్రంలో తమన్నా ఇలా అదరగొట్టింది.

ఆవారా, 100%లవ్ చిత్రాల్లో తమన్నా అందాలు అదుర్స్.

తడిసిన అందాల నడుమ సెక్సీగా నాభి అందాలు చూస్తే మతిపోనిదెవరికి?


Click it and Unblock the Notifications











