తెగించుడే: బికినీలో హీరోయిన్ తమన్నా డాన్స్!
హైదరాబాద్: హీరోయిన్ తమన్నా బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అక్కడ ఎదిగేందుకు ఎంతటి తెగింపుకైనా సిద్ధమే అంటూ ముందుకు సాగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమన్నా ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తున్న 'హమ్‌షకల్స్' చిత్రంలో హాట్ అండ్ సెక్సీగా అందాల ఆరబోతకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో తమన్నా తన కెరీర్లోనే తొలిసారి బికినీలో దర్శనమివ్వబోతోంది. ఇటీవల మారిసష్ లోని బీచుల్లో ఇందుకు సంబంధించిన హాట్ సీన్లు చిత్రీకరించారు. ఈ సినిమాలోని ఓ పాటలో తన సెక్సీ ఒంపు సొంపులను బికినీలో ప్రదర్శిస్తూ తమన్నా డాన్న్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టిందని తెలుస్తోంది.

బాలీవుడ్ మూవీ లవర్స్‌కు తమన్నా గ్లామర్ పెర్ఫార్మెన్స్ మంచి కిక్ ఇస్తుందని దర్శకుడు సాజిద్ ఖాన్ భావిస్తున్నాడు. సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈచిత్రం జూన్ 20న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రంతో అయినా తమన్నా దశ తిరుగుతుందో? లేదో? చూడాలి.
తమన్నా ఇతర సినిమాల వివరాల్లోకి వెళితే....తెలుగులో తమన్నా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బాహుబలి', శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆగడు' చిత్రంల్లో నటిస్తోంది. దీంతో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications











