'ఆగడు': ఈ ఫొటోలే లీక్ అవుతున్నాయేంటి?

By Srikanya

హైదరాబాద్ : 'ఆగడు' చిత్రం నిర్మాతలు ఏమన్నా డిఫెరెంట్ గా పబ్లిసిటీ చేద్దామని లీక్ చేస్తున్నారో ఏమో కానీ...కేవలం తమన్నా ఫొటోలు మాత్రమే బయిటకు వస్తున్నాయి. మొన్నో తమన్నా ఫొటో వస్తే...ఇప్పుడు మరో ఫొటో వచ్చింది. రెండిట్లోనూ తమన్నా హోమ్లీ లుక్ కనపడటం విశేషం. ఇప్పుడు మీరు ప్రక్కన చూస్తున్న ఫొటో లేటెస్టు గా విడుదలైనది. ఈ ఫొటో చూసిన వాళ్లు ఏదో పెళ్లి సాంగ్ కు సంభందించిన షూటింగ్ సమయంలోది అంటున్నారు.

మహేష్‌బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం కాబోతున్న సంగతి తెలిసిందే. 'దూకుడు' తరవాత వీరిద్దరి నుంచి వస్తున్న చిత్రమిది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా చాలా మందిని అనుకుని తమన్నాని ఖరారు చేశారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

అంతేకాదు మహేష్‌తో జత కట్టడం తమన్నాకి ఇదే తొలిసారి. దాంతో ఆమె ఎగిరి గంతేసి ఒప్పుకుందని,కంటిన్యూ డేట్స్ కేటాయించటానికి ముందుకువచ్చిందని సమాచారం. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. వినోదం, యాక్షన్‌ కలగలిపిన చిత్రమిది. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్ ...టఫ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.

Tamanna draped in a saree!

గతంలో పోకిరి,దూకుడు చిత్రాలలో పోలీస్ గా కనిపించిన మహేష్ బాబు మరోసారి పోలీస్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ఆగడు లో మహేష్ మరోసారి పోలీస్ గా తన విశ్వరూపం చూపించనున్నాడని సమాచారం. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సారి మరింత యాక్షన్ ని పెంచినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో చేసిన బాద్షా చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవటంతో ఈ సారి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని శ్రీను వైట్ల ఫిక్సైనట్లు చెప్తున్నారు. అందుకు తగినట్లే మహేష్ క్యారెక్టర్ ని టఫ్ పోలీస్ గా రూపొందించినట్లు చెప్పుకుంటున్నారు.

ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X