అందులో ఉన్న మజా అంతా ఇంతా కాదు: తమన్నా
'దేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో? అనడిగితే… వచ్చే జన్మలో కూడా సినీ హీరోయిన్ గానే పుట్టించమని కోరుకుంటా"" అంటున్నారు పాలబుగ్గల తమన్నా. ఇప్పటి వరకూ అన్ని భాషల్లో కలిపి ఓ 19 సినిమాలు చేసుంటాననీ, ఈ తక్కువ సమయంలోనే సినిమాపై అపారమైన ప్రేమ పెరిగిపోయిందని అంటున్నారామె. ఇంకా తమన్నా మాట్లాడుతూ- 'ఏదో సాధించేద్దాం అని ఈ రంగంలోకి రాలేదు.
అనుకోకుండా చిన్న వయసులోనే వచ్చేశాను. సక్సెస్ రావడం కాస్తంత లేట్ అయినా.. నటించడం మాత్రం తేలికే అనిపించింది. కానీ.. పోనూ పోనూ అర్థమవుతోంది.. నటించడం ఎంత కష్టమో. గొప్ప నటి అనిపించుకోవడం అంత ఈజీ కాదు. తెరపై నిరంతరం ప్రతిభ కనబరిస్తే కానీ గొప్ప నటి అనిపించుకోలేం. స్టార్ డమ్ పెరిగే కొద్దీ మంచి పాత్రలు రావడం మొదలుపెడతాయి. మంచి పాత్రలకు న్యాయం చేయడం అంటే నిజంగా కత్తిమీద సామే. కానీ ఆ పాత్రను పోషించడంలో ఉన్న మజా అంతా ఇంతా కాదు.


Click it and Unblock the Notifications











