తమన్నాకు సమైక్య‌సెగ : అందరూ ఒక్కటేనని వివరణ

By Bojja Kumar

విశాఖపట్నం : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం ఊపందుకుంది. బంద్ కార్యక్రమాలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సినిమా షూటింగ్ నిమిత్తం విశాఖపట్నం వచ్చిన తమన్నాను సమైక్య వాదులు అడ్డుకున్నారు.

జై సమైక్యాంధ్ర నినాదాలు చేయాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. అయితే తమన్నా జై సమైక్యాంధ్ర అనడానికి నిరాకరించింది. తనకు అన్నిప్రాంతాల వారూ ఒక్కటే అని, ఎవరికీ మద్దతుగా మాట్లాడలేనని స్పష్టం చేసారు. అయినా సమక్యవాదులు వినిపించుకోలేదు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం తమన్నా ఒక తమిళ చిత్రం, ఓ హిందీ చిత్రంలో నటిస్తోంది. అందులో ఒకటి అజిత్ హీరోగా రూపొందుతున్న తమిళ చిత్రం 'వినాయగమ్ బ్రదర్స్' కాగా, మరొకటి ఇట్స్ ఎంటర్టెన్మెంట్ అనే హిందీ చిత్రం. దీంతో పాటు హమ్ షకల్ అనే మరో హిందీ చిత్రంలో కూడా చేయబోతోంది.

త్వరలో తమన్నా మహేష్ బాబు సరసన 'ఆగడు' అనే తెలుగు చిత్రంలో నటించబోతోంది. ఈచిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్నారు. దూకుడు చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ బేనర్ పై ఈచిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X