తమన్నా ఎందుకు అలా తయారైంది?
హైదరాబాద్: తెలుగు టాప్ హీరోయిన్లలో తమన్నా ఒకరు. ఆ మధ్య తెలుగులో వరుస చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్న తమన్నా ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటిస్తోంది. ఆ చిత్రం మరేదో కాదు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' చిత్రం. ఈ చిత్రంతో పాటు తమిళంలో ఆర్య హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తోంది.
ఈ రెండు చిత్రాలు 2014 నుండి కొనసాగుతున్నాయి. 2015లో తమన్నాకు ఒక్కటంటే ఒక్క కొత్త అవకాశం కూడా కాలేదు. ఆల్రెడీ చేతిలో ఉన్న సినిమాల షూటింగులు పూర్తవుతున్నాయి. దీంతో అమ్మడు ఆలోచనలో పడింది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు వచ్చే పరిస్థితులు కనిపించక పోవడంతో తమిళ పరిశ్రమపై దృష్టి సారించింది.

బక్క పలుచగా ఉంటే తమిళంలో అవకాశాలు దక్కించుకోవటం కష్టమే. కాస్త బొద్దుగా ఉండే భామలకే అక్కడ ప్రాధాన్యత. ఈ విషయాన్ని గ్రహించిన తమన్నా ప్రస్తుతం బరువు పెరిగే పనిలో ఉంది. ఇటీవలో ఓ ఫంక్షన్లో తమన్నా కాస్త లావెక్కి కనిపించిందని తెలుస్తోంది. సినిమా అవకాశాల కోసం ఆమాత్రం కష్ట పడాల్సిందే మరి!
తమన్నాకు తెలుగులో అవకాశాలు తగ్గడానికి కారణం ఆమె నటించిన గత చిత్రాలు ‘ఆగడు' చిత్రం ప్లాపు కావడమే. అటు హిందీలో ఆమె నటించిన రెండు చిత్రాలు నిరాశనే మిగిల్చాయి. అందుకే ఈ రెండు పరిశ్రమలు కాకుండా ఈ సారి తమిళ సినీ పరిశ్రమపై దృష్టి సారించింది.


Click it and Unblock the Notifications











