తమన్నా నగ్న ఫోటోలు, పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన తమన్నాకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఆమె ఫోటోలను నగ్నంగా మార్పింగ్ చేసిన కొందరు ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసారట. ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో షేర్ అవుతూ...చివరకు తమన్నా దృష్టికి వచ్చింది. దీంతో ఖంగుతిన్న తమన్నా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫిర్యాదు విషయం అపీషియల్‌గా ఖరారు కావాల్సి ఉంది.
తమన్నా ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోంది. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘ఆగడు' చిత్రంలో హీరోయిన్ చేస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. మహేష్ బాబుతో తమన్నా నటిస్తున్న తొలిసినిమా ఇది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరో వైపు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి'లో తమన్నా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో జరుగుతోంది. ఈ షూటింగులో పాల్గొనడం కారణంగా ‘ఆగడు' ఆడియోకు వేడుకకు డుమ్మా కొట్టింది తమన్నా.
ఈ మధ్య తెలుగులో సరైన హిట్ లేని తమన్నా ఇతర హీరోయిన్లతో పోలిస్తే కాస్తవెనక పడిపోయిందనే చెప్పొచ్చు. దీంతో ఈ రెండు చిత్రాలపైనే బోలెడు ఆశలు పెట్టుకుంది ఈ మిల్కీ బ్యూటీ. మరి తాజాగా వెలుగులోకి వచ్చిన తమన్నా మార్ఫింగ్ న్యూడ్ ఫోటోల వ్యవహారం ఆమెకు కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











