హీరోలందర్నీ పొగిడే బృహత్తర కార్యక్రమంలో తమన్నా..
తమన్నా కూడా ఇప్పుడు ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోని మోసేయడం అలవాటు చేసుకుంది. నిన్నటి దాకా అల్లు అర్జున్ అంతటి డ్యాన్సర్ లేడని చెప్పిన తమన్నా, ఇప్పుడు మరో హీరో రామ్ ని పొగడడం మొదలెట్టింది. రామ్, తమన్నా జంటగా స్రవంతి మూవీస్ పతాకంపై ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఎందుకంటే ప్రేమంటే అని చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'ప్రస్తుతం 'ఎందుకంటే.. ప్రేమంటే' సినిమా పాటల చిత్రీకరణ జరుగుతోంది. బాబోయ్... రామ్ తో డ్యాన్స్ చేయడం నా వల్ల కావడం లేదు. అతని స్పీడందుకోవడానికి చాలా కష్టపడాల్సివస్తోంది' అంటూ పొగుడుతోంది.
మరి అల్లు అర్జున్ మాటేమిటి? అంటే, 'డ్యాన్సుల్లో బన్నీ, రామ్ ఇద్దరూ ఇద్దరే. ఒకరిని మించి మరొకరు చేస్తారు. అసలు తెలుగు హీరోలలో వున్నంత మంది మంచి డ్యాన్సర్లు మరెక్కడా లేరు. జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా అంతే" అంటోంది. బద్రీనాథ్ లో బన్నీతో పోటీపడి చేయడం వల్ల తనకు డ్యాన్సుల్లో పట్టు దొరికిందని చెబుతోంది. ఏమైనా... హీరోలందర్నీ పొగిడే బృహత్తర కార్యక్రమం మాత్రం బాగానే పెట్టుకుంది తమన్నా.


Click it and Unblock the Notifications











