For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమన్నా 'గాంగ్నమ్ స్టైల్' డాన్స్ ఫోటో ఇదే

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'గాంగ్నమ్ స్టైల్' ఫీవర్ ..ఇప్పుడు తమన్నానీ తాకింది. ఆమె తాజాగా చేస్తున్న హిందీ చిత్రం 'హిమ్మత్ వాలా' లో ఆమె ఈ స్టైల్ డాన్స్ చేసి అందరినీ అలరించింది. తన సెక్సీ అందాలు, ఈ చిత్రంలోని 'బుం పె హాత్' అనే పాటలో తమన్నా 'గాంగ్నమ్ స్టైల్' స్టెప్పులు వేసిందని సమాచారం. అలాగే చిత్రం ప్రమోషన్ లో కూడా ఆమె ఈ స్టెప్స్ వేయనుంది.

    ఈచిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా వాసు భగ్నాని, యూటీవీ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది. వాస్తవానికి హిమ్మత్ వాలా సినిమాకు మూలం టాలీవుడ్లోనే ఉంది. తెలుగులో కృష్ణ,జయప్రద జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊరికి మొనగాడు' చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది.

    అదే సినిమాను పద్మాలయా సంస్థ హిందీలో 'హిమ్మత్ వాలా' పేరుతో 1983లో తెరకెక్కించింది. ఇందులో జితేంద్ర, శ్రీదేవి నాయకానాయికలుగా నటించారు. ఈ సినిమాకు కూడా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే బాలీవుడ్ లో శ్రీదేవి అందాల తారగా మార్కులు సంపాదించారు. ఇప్పుడు అదే చిత్రం రీమేక్‌లో తమన్నా నటిస్తోంది. 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే బాలీవుడ్ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన తమన్నాకు అక్కడ కలిసి రాక సౌత్ బాట పట్టి సక్సెస్ అయింది. మరి హిమ్మత్ వాలా రీమేక్ ద్వారా తమన్నా బాలీవుడ్లో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

    ఒక సినిమాకూడా విడుదల కాకుండానే తమన్నాకు ఆఫర్స్ వరసగా వచ్చి పడుతున్నాయి. ఆమె తాజా చిత్రం హిమ్మత్ వాలా.. ట్రైలర్స్ చూసిన బాలీవుడ్ జనం ఆమెచుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దాంతో తమన్నా హిందీలో మరో అవకాశాన్ని దక్కించుకొన్నట్లు సమాచారం. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించబోయే చిత్రంలో తమన్నా హీరోయిన్ గా ఎంపికైంది. ఈ యేడాది చివర్లో షూటింగ్ మొదలవుతుంది. హిమ్మత్ వాలా చిత్రం మార్చి 29 న విడుదల అవుతుంది.

    English summary
    Gangnam style has a lot of influence on our stars. It would be a great treat to watch Tamanna in Gangnam style. Certainly, it is going to be her treat to fans. She is doing it in her much anticipated film remake of 'Himmatwala' which features Ajay Devgn in the lead role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X