‘100% లవ్’ చూసిన వారందరూ అలాగే అంటున్నారు: తమన్నా
నాగచైతన్య, తమన్నా నటించిన '100% లవ్" సినిమా చూసిన వారందరూ 'దటీజ్ మహాలక్ష్మి.." అంటున్నారు అంటోంది హ్యాపీ గర్ల్ తమన్నా.అలాగే ఒక్క యూత్‌నే కాదు... ఆ పాత్ర ద్వారా మిడిల్ ఏజ్ వాళ్లని కూడా మెప్పించేశారంటోంది తమన్నా.క్రిందటి శుక్రవారం విడుదలైన '100% లవ్"చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది.ఈ ఆనందాన్ని మీడియా వద్ద వ్యక్తం చేస్తూ తమన్నా ఇలా స్పందించింది.అలాగే తమిళనాట ఎంత బిజీగా ఉన్నా... మనసంతా తెలుగు సినిమా పైనే ఉండేది. ఇన్నాళ్లకు నేను కోరుకున్న విజయం నాకు దక్కింది. మహాలక్ష్మి పాత్రలో చాలా కోణాలున్నాయి. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఒక్కోసారి కోపం తెప్పిస్తుంది. ఇంతమంచి పాత్రను నాకిచ్చిన సుకుమార్‌గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చైతూ చాలా ప్రొఫెషనలిస్ట్.
కెమెరా ముందు ఎంత వర్క్ మూడ్‌లోకి వెళ్తాడో, బయట అంత జోవియల్‌గా ఉంటాడు. అతను ఏకసంథాగ్రహి. ఎంత పెద్ద డైలాగ్ అయినా ఈజీగా చెప్పేస్తాడు. కో-స్టార్ మంచి ఆర్టిస్ట్ అయితే ఆటోమేటిక్‌గా పక్కవారికి కూడామంచి పేరొస్తుంది. ఆ రకంగా తనతో కలిసి నటించాను కాబట్టే ఇప్పుడు అందరూ 'మహాలక్ష్మి"ని మెచ్చుకుంటున్నారు. చైతన్యతో కలిసి పనిచేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్"" అని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలుగులో బద్రినాథ్, కందిరీగ చిత్రాల్లో అల్లు అర్జున్, రామ్ సరసన తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











