స్టార్ హీరో కంపు వ్యవసనంపై తమన్నా కంప్లైంట్
హైదరాబాద్ : స్టార్ హీరోలతో పనిచేయడం అవకాశం రావడం అంత ఆశామాషీ కాదు. అందుకే వారితో కలిసి పని చేసేప్పుడు హీరోయిన్లతో పాటు దర్శక నిర్మాతలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. వారితో తేడా వస్తే ఇబ్బంది తప్పదనే భయమే ఇందుకు కారణం. ఇక హీరోయిన్ల పరిస్థితి అయితే మీరీ దారుణం. నచ్చకపోతే కర్చీఫ్ మార్చేసినట్లు హీరోయిన్లను మార్చేయడం ఈ మధ్య సినిమాల రంగంలో కామన్ అయిపోయింది. అందుకే హీరోయిన్లు హీరోలకు ఏ విషయంలోనైనా సరే ఎదురు మాట్లాడే పరిస్థితి ఉండదు.
కానీ హీరోయిన్ తమన్నా రూటే సపరేటే. స్టార్ హీరో అయినా, ఇంకెవరైనా......తాను చెప్పాల్సింది ముక్కు సూటింగా చెప్పేడం ఆమెకు అలవాటు. వారి వద్ద తనకు నచ్చని అంశాలను నిర్మొహమాటంగా బయటపెట్టే మనస్తత్వం ఆమెది. సౌత్ లో ఓ వెలుగు వెలిగిన ప్రస్తుతం 'హిమ్మత్ వాలా' చిత్రం ద్వారా బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తమన్నా ఇటీవల ఆ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో హీరో అజయ్ దేవగన్‌కు షాకిచ్చింది.
అజయ్ దేవగన్ చైన్ స్మోకర్. పొగ త్రాగే వారి వద్ద నుంచి వచ్చే ఆకంపు ఏం రేంజిలో ఉంటుందో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. స్మోకింగ్ వాసనంటేనే అస్సలు పడని తమన్నా......ఆ కంపూ భరిస్తూనే హిమ్మత్ వాలా షూటింగులో పాల్గొంది. సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు ఏమీ మాట్లడకుండా మిన్నకున్న తమన్నా...ఇటీవల ఆ సినిమా ప్రచారంలో అతని వ్యసనాన్ని వేలెత్తి చూపింది. ప్లీజ్ మీరు పొగ తాగడం మానేయండి అంటూ పబ్లిగ్గా చురకలంచింది. దీంతో ఆ చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్ తో పాటు అంతా షాకయ్యారు.
తమన్నా ఇలా అందరి ముందు తన పరువు తీయడంతో ఏం చేయాలో తోచని అజయ్ దేవగన్ కాస్త ఇబ్బందిగా పీలైనా, ఆమె చెప్పింది తన మంచి కోసమే కాబట్టి ఆమె కామెంట్ ను పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నాడు. ఇక సినిమా వివరాల్లోకి వెళితే గతంలో శ్రీదేవి-జితేంద్ర జంటగా 1983లో వచ్చిన 'హిమ్మత్ వాలా' చిత్రానికి రీమేక్. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అంచనాలను అందుకోలేక పోయింది.


Click it and Unblock the Notifications











