తమన్నాకు కిక్కు ఎక్కిందా?
హ్యాపీడేస్ స్టార్ తమన్నాకి సక్సెస్ కిక్ తలకెక్కిందని, అందరితో చాలా పొగరుగా మాట్లాడుతోందని, ఎవరినీ లెక్కచేయటం లేదని వినపడుతోంది. తెలుగు పరిశ్రమను ప్రక్కన పెడితే ఆమెను టక్కున అక్కున చేర్చుకున్న తమిళ చిత్ర సీమలో ఈ కామెంట్స్ విపరీతంగా వినపడుతోంది. అంతేగాక హ్యాపీడేస్ లో ఆమెతో పాటు నటించిన వరుణ్ సందేశ్, రాహుల్, నికిల్, వంశికృష్ణలతో అయితే అస్సలు కాంటాక్ట్ లో లేదని సమచారం. ఆ సినిమా షూటింగ్ అప్పటికి ఆమె శ్రీ అనే ఓ ప్లాఫ్ సినిమాతో పరిచయమైన హీరోయిన్ మాత్రమే. దాంతో తోటి నటులతో చాలా చక్కగా ప్రెండ్ షిప్ చేసి కలిసిపోయింది.
కానీ కాలం కలిసివచ్చి, లైఫ్ కి కలర్ వచ్చేసరికి వీరు చేస్తున్న ఫోన్ లు సైతం లిప్ట్ చేయటం లేదుట. నిజంగా బిజీగా ఉండి ఎత్తలేదని మొదట సరిపెట్టుకున్నా నలుగురు హీరోలు కలిసినప్పుడు ఆమె ఎవరి ఫోన్ లిప్ట్ చేయటం లేదని, కలవటానకి కూడా పెద్దగా ఆసక్తి చూపటం లేదని వారికి అర్ధమైంది. ఇదిలా ఉంటే వరుణ్ సంధేశ్ సైతం మొదట్లో బాగానే ఉన్నా కొత్త బంగారులోకం హిట్ తో అతనూ తమన్నాలా దూరమవటానికే ప్రయత్నిస్తాడని సమచారం. అయినా కొత్త అవకాశాలు, కొత్త మనుషులు పరిచయమవుతున్నప్పుడు పాతవాళ్ళనే ఏం పట్టుకు వ్రేళ్ళాడుతారు..వీళ్ళూ ఎదిగితే వాళ్ళూ కులుపుకుంటూ పోతారు..గుర్తిస్తారు.


Click it and Unblock the Notifications











