పాపం..తమన్నా సెంటిమెంట్ రివర్స్
తమన్నా గోల్డెన్ లెగ్ ఆమె ఉంటే చాలు హిట్ దానంతట అదే ఉరుక్కుంటూ వస్తుంది అన్న నిర్మాతలు, దర్శకులు ఇప్పుడు సమంతకు ఆ సూత్రాన్ని అప్లై చేస్తున్నారు. వరసగా సమంత చేసిన చిత్రాలు భాక్సాఫీస్ వద్ద నిరాశపరచటం ఓ కారణంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఎంతో అంచనాలుతో విడుదలైన బద్రీనాద్, ఊసరవెల్లి చిత్రాలను వారు ఉదరహిస్తున్నారు. ఇక శ్రీ చిత్రంతో పరిచయమై తమన్నా ఆ తర్వాత 'హ్యాపీడేస్'వచ్చే దాకా ఆమెకు హ్యాపీ డేస్ స్టార్ట్ కాలేదు. ఇక్కడ కొన్ని సినిమా చేసిన తర్వాత ఆమె తమిళరంగంపై దృష్టి నిలిపింది. అక్కడ కూడా మంచి కమర్షియల్ చిత్రాల్లో నటించేసింది. అవన్నీ తెలుగులోకి అనువాదం కావడంతో ఇక్కడా పాప్యులారిటీ పెంచుకుంది. తెలుగు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఏకంగా భారీ చిత్రాల్లో, అగ్రహీరోల కాంబినేషన్ అవకాశాలు రావడంతో తెలుగులో మిగతా హీరోయిన్స్ వెనుకపడ్డారు.
అయితే తమన్నాది గోల్డెన్ లెగ్ అనే నమ్మకంతో చిత్రాల్లో ఎంపికచేసుకున్న నిర్మాతలకు ఇప్పుడు ఆ భ్రమలు తొలగిపోతున్నాయి. ఆమె ఖాతాలో రీసెంట్ గా హండ్రెడ్ పర్శంట్ లవ్ తప్ప ఏమీ కనపడటం లేదు. అందులోనూ దర్శకుడు సురేంద్రరెడ్డి ఆమె పాత్రను నమ్మే ఊసరవెల్లి చిత్రం చేసాననటం ఆ పాత్ర ప్రేక్షకులకు పట్టకపోవటం ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. కాజల్ లాగానే ఆమె కూడా ప్లాపులతో నీరసపడింది.ప్రస్తుతం తమన్నా రామ్ చరణ్ సరసన రచ్చ చిత్రంలో చేస్తోంది. ఆ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రీసెంట్ గా గోవాలో క్లైమాక్స్ ని షూట్ చేసారు.అయితే ఈ పరిస్దితిని ఆమె ఒప్పుకునేటట్లులేదు.. ఆమె నా చేతిలో రెండు తమిళ ప్రాజెక్టులు ఉన్నాయంటోంది.


Click it and Unblock the Notifications











