తమన్నాకు నిద్ర లేని రాత్రులు
సౌత్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తమన్నా ప్రస్తుతం నిద్రలేని రాత్రులు గడుపుతోంది. అవకాశాలు బాగానే ఉన్నాయి, కెరీర్ కూడా మంచి స్పీడ్‌తో కొనసాగుతోంది, మరి తమన్నాకు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పని ఏమిటనేగా..మీ డౌట్. తమన్నాకు నిద్రలేకుండా గడపటానికి కారణం కెరీర్‌పై టెన్షన్‌తో కాదు, పని ఎక్కువ కావడం వల్లనే ఇలా జరుగుతోందట.
ప్రస్తుతం తమన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఎన్టీఆర్ సరసన ఊసరవెల్లి సినిమాతో పాటు, రామ్ చరణ్‌తో రచ్చ, ఎందుకంటే ప్రేమంట సినిమాలు చేస్తుంది. అదిగాక రెబల్ సినిమాలో ప్రభాస్ సరసన బుక్కయి పోయింది కూడా. వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలను వద్దంటే బాగుండదని అన్నింటీకి ఓకే చెప్పిన తమన్నా...ఇప్పుడు ఆ సినిమాలకు న్యాయం చేయడానికి ఓవర్ టైమ్ పని చేస్తోంది. రోజూ లేట్ నైట్ షూటింగులు పూర్తి చేసుకుని రావడం, కంటి నిండా నిద్ర పోకుండా ఉదయాన్నే తిరిగి మళ్లీ షూటింగులకు వెలుతోంది. పని ఒత్తిడి ఎక్కువయి ఆమెకు రాత్రి నిద్ర కరువవుతోందని, ఫలితంగా నిద్రమాత్రలను ఆశ్రయిస్తుందని సమాచారం.


Click it and Unblock the Notifications











