కృష్ణ ‘ఊరికి మొనగాడు’ రీమేక్‌లో తమన్నా
సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఊరికి మొనగాడు (1981) చిత్రం ఇప్పుడు అజయ్ దేవగన్ తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత విషు భగ్నాని ఈ చిత్రం రీమేక్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారుయ. అయితే విషయమేమిటంటే ఊరికి మొనగాడు చిత్రం ఆల్రెడీ ఒకసారి హిమ్మత్ వాలాగా రీమేక్ అయ్యింది. ఆ చిత్రాన్ని అప్పట్లో కె.రాఘవేంద్రరావు డైరక్ట్ చేసారు. హిమ్మత్ వాలా చిత్రం శ్రీదేవికి తొలిసారి బ్రేక్ ఇచ్చింది. ఇక హిందీలోకి మరోసారి రీమేక్ అవుతున్న ఈ చిత్రంలో తమన్నాని హీరోయిన్ గా తీసుకుంటనట్లు తెలుస్తోంది. సాజిద్‌ఖాన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ఈ చిత్రదర్శక,నిర్మాతలు తమన్నాతో సంప్రదింపులు జరుపుతున్నారు.
అన్నీ కుదిరితే త్వరలో ఆమె ఈ సినిమాకి సైన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక గతంలో జితేంద్ర, శ్రీదేవి కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని 'హిమ్మత్‌వాలా'గా రీమేక్ చేసారు. అప్పట్లో 'హిమ్మత్‌వాలా' చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ చిత్రం రీమేక్ ద్వారా బాలీవుడ్‌లో తమన్నా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభమవుతుంది అంటున్నారు. మొదట అంటే 2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' చిత్రం ద్వారా తమన్నా బాలీవుడ్ లో హీరోయిన్ గా రంగప్రవేశం చేసినా వర్కవుట్ కాకపోవటంతో ఇలా తెలుగుకి పరిచయమై ఇక్కడ పాతుకుపోయింది.


Click it and Unblock the Notifications











