తమన్నా బాలీవుడ్ మూవీ రామోజీఫిల్మ్ సిటీ
హైదరాబాద్: కోలీవుడ్‌లో సత్తా చాటుకుని టాలీవుడ్‌లో యంగ్ టాప్ హీరోస్ తో నటిస్తున్న తమన్నా చూపు బాలీవుడ్ వైపు సాగుతోంది. ఇక్కడ బిజీగా ఉన్నా హిందీ చిత్రసీమలోనూ అవకాశాలు దక్కించుకుంటోంది. జింతేంద్ర-శ్రీదేవి నటించి 'హిమ్మత్ వాలా' హిందీ రీమేక్‌లో తమన్నా హీరోయిగా ఎంపికైత విషయం తెలిసిందే. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ఈచిత్రం ఆగస్టు 19 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకోనుంది.
ఆర్ట్ డైరెక్టర్ సబు సిరిల్ రామోజీ ఫిల్మ్ ప్రత్యేకంగా సెట్ డిజైన్ చేస్తున్నారు. ఈచిత్రానికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తుండగా వాసు భగ్నాని, యూటీవీ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
తెలుగులో కృష్ణ,జయప్రద జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊరికి మొనగాడు' చిత్రం విజయాన్ని సాధించింది. ఈ సినిమాను పద్మాలయా సంస్థ హిందీలో 'హిమ్మత్ వాలా' పేరుతో తెరకెక్కించింది. ఇందులో జితేంద్ర, శ్రీదేవి నాయకానాయికలుగా నటించారు. ఈ సినిమాకు కూడా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతోనే బాలీవుడ్ లో శ్రీదేవి అందాల తారగా మార్కులు సంపాదించారు. ఇప్పుడు అదే చిత్రం రీమేక్‌లో తమన్నా నటిస్తోంది.
బాలీవుడ్ హీరోల్లో చాలామంది రీమేక్స్ పై దృష్టి సారించారు. తాజాగా అజయ్ దేవగన్ కూడా అదే బాట పట్టి, జితేంద్రకు గ్రాండ్ సక్సెస్ ను అందించిన 'హిమ్మత్ వాలా'ను ఎంచుకున్నారు. ఈ చిత్రంలో ఈ పాత్ర కోసం సాజిద్ ఖాన్ కత్రిన కైఫ్ మరియు అనుష్క శర్మలను సంప్రదించగా వారు ఒప్పుకోలేదు . అజయ దేవగన్ ఈ పాత్రకి సౌత్ ఇండియన్ నటిని తీసుకోమని సలహా ఇచ్చారు సాజిద్ ఖాన్ తమన్నాని ఎంచుకున్నారు. ఈ చిత్రంలో సాజిద్ ఖాన్ చాలా మార్పులు చేసినట్టు తెలుస్తుంది.
తమన్నా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'కెమరామెన్ గంగతో రాంబాబు' చిత్రం, ప్రభాస్‌తో రెబెల్ చిత్రం చేస్తోంది. తమన్నా తన నటనా జీవితాన్ని హిందీలో 'చాంద్ సా రోషన్ చెహ్ర' చిత్రంతో మొదలు పెట్టింది. ఈ చిత్రం అక్కడ భారీ పరాజయం చవి చూసింది. హిమ్మత్ వాలాతో మళ్లీ బాలివుడ్ లో తిరిగి అడుగు పెట్టబోతుంది.


Click it and Unblock the Notifications











