»   » తమన్నాకు వినాయిక్ ట్విస్ట్

తమన్నాకు వినాయిక్ ట్విస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ఈ నెల 20న పాటతో చిత్రీకరణ మొదలు పెడుతున్నాం. హీరోయిన్‌గా సమంత నటిస్తోంది. మొదట వేరే స్క్రిప్టు అనుకున్నాం. అందులో సమంత, తమన్నా హీరోయిన్లుగా అనుకున్నాం. కానీ ఇప్పుడు స్క్రిప్ట్ మారింది. ఇందులో ఒకే హీరోయిన్ ఉంటుంది. ఇందులో తమన్నా లేదు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ అని తేల్చి చెప్పారు వి వి వినాయిక్. బెల్లంకొండ సురేష్ కుమారుడు హీరోగా వివి వినాయిక్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో మొదట సమంత,తమన్నా అనుకున్నారు కానీ ఇప్పుడు అక్కర్లేదని తేల్చి చెప్పేసారు.

చిత్రం గురించి వివి వినాయిక్ మాట్లాడుతూ...'నాయక్' తర్వాత బెల్లంకొండ సురేశ్ వాళ్లబ్బాయి శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేద్దామని నిర్ణయించుకున్నాను. స్క్రిప్టు తయారుచేశాం. కానీ అది పూర్తి సంతృప్తినివ్వలేదు. మరింత మంచి స్క్రిప్టుతో శ్రీనివాస్‌ను పరిచయం చెయ్యాలని సురేశ్ కూడా అన్నారు. అందువల్లే ఆ సినిమాని లాంఛనంగా ప్రారంభించాక సెట్స్ మీద వెళ్లడానికి ఇంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు అందరికీ నచ్చిన స్క్రిప్టు పక్కాగా సిద్ధమైంది అన్నారు.


ప్రస్తుతం తెలుగు సిని పరిశ్రమలో సమంత క్రేజీ హాట్ ఐటమ్ గా మారింది. ఈ అమ్మడు తమ సినిమాలో నటిస్తే చాలు హిట్‌ కొట్టడం ఖాయమని దర్శకనిర్మాతలంతా సెంటిమెంట్‌ ఫీలవుతున్నారు. అందుకే వరుసగా అగ్రహీరోల సినిమాలన్నిటా సమంత హీరోయిన్. పవన్‌తో 'అత్తారింటికి దారేది' బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాక సమంత రేంజి అమాంతం పెరిగింది. మరో నాలుగేళ్లు ఈమె డైరీ ఫుల్‌. ఈ నెలలోనే ఎన్టీఆర్‌ 'రామయ్యా ...' సినిమాతో మరో హిట్‌కొట్టడా నికి రెడీ అవుతోంది.

అలాగే ఎన్టీఆర్‌ సరసన నటిస్తూ 'రభస' చేస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం జోరుగా సాగు తోంది. అదేగాక అక్కినేని 'మనం'లోనూ ఓ హీరోయిన్ గా నటిస్తోంది. లింగుస్వామి సొంత ప్రొడక్షన్‌లో నిర్మించే తమిళ్‌, తెలుగు ద్విభాషా చిత్రంలోనూ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఆటోనగర్‌ సూర్య లోనూ సమంత హీరోయిన్ . ఇవేగాక బెల్లకొండ సురేష్‌ తనయుడు హీరోగా పరిచయం అవుతున్న సినిమాలోనూ సమంత హీరోయిన్ . వాస్తవా నికి ఈ సినిమాలో తమన్నా కథానా రుుకగా నటించాల్సి ఉన్నా.. అనూహ్యంగా సమంత ఆ స్థానాన్ని రీప్లేస్‌ చేసింది.

English summary
VV Vinayak says that Tamanna not in his latest film. She is replaced by Samantha. I was committed to launch producer Bellamkonda Suresh's son Sai. He was my first producer and my fruitful career and success is result of he launching me with Aadhi. So I want to launch his son with good script. I heard couple of stories, none satisfied me.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu