రాత్రి...ఫ్రెండ్స్ తో పార్టీలో తమన్నా (ఫొటో)
ముంబై: తమన్నా ను చూసిన వాళ్లెవరూ ఆమె పార్టీలకు హాజరవుతుందని, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుందని భావించరు. అందుకు కారణం ఆమె హైదరాబాద్ లో ఎప్పుడూ ఏ పార్టీలోనూ కనపడలేదు. అయితే అది నిజానికి నిజం కాదు. ఆమె ముంబైలో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలంటూ ఎంజాయ్ చేస్తుంది. ఇదిగో ఈ ఫొటోనే సాక్ష్యం.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
నిన్న రాత్రి తమన్నా... తన స్నేహితురాల్లు ఇషా కొప్పికర్ (నటి), పూజ మోక్షజ(న్యూట్రిషన్) లతో కలిసి ముంబై బాంద్రా వెస్ట్ లోని రేడియో బార్ లో పార్టీ ఇచ్చింది. ఇదిగో వీళ్లతో కలిసి సరదాగా ఇలా ఫొటో కూడా దిగింది. మంచి మూడ్ లో ఉంది కదూ తమన్నా.
తమన్నా కెరీర్ కు వస్తే..

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ హీరోయిన్ పదేళ్లు చిత్రసీమలో కొనసాగిందంటే నిస్సందేహంగా ఓ రికార్డే. రోజుకో కొత్త అందం వెలుగులోకి వస్తున్న పరిస్థితుల్లో ఆ పోటీని తట్టుకొని అవకాశాలు చేజిక్కించుకోవడం ఆషామాషీ కాదు. ఆ విషయంలో దటీజ్ మహాలక్ష్మి అనిపించుకొంది తమన్నా.
'శ్రీ'తో ప్రయాణం మొదలుపెట్టిన ఆమె అటు అందంతోనూ, ఇటు నటనతోనూ అలరించింది. తిరుగులేని హీరోయిన్ గా వరుస విజయాలు అందుకొంది. ఇప్పటికీ క్లిష్టమైన పాత్ర అంటే తమన్నానే గుర్తుకొస్తుంది దర్శకులకు. త్వరలోనే 'బాహుబలి'తో సందడి చేయనున్న ఆమె 'బెంగాల్‌టైగర్', నాగ్-కార్తీల చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.
తమన్నా మాట్లాడుతూ...ఇప్పుడంతా నన్ను సీనియర్ హీరోయిన్స్ జాబితాలో చేరుస్తున్నారు...వాళ్లు చేర్చడం సంగతేమో కానీ... ఆ విషయం గుర్తొచ్చినప్పుడు, ఎవరైనా గుర్తు చేసినప్పుడు 'అప్పుడే అంత పెద్దదాన్నైపోయానా?' అనిపిస్తుంటుంది. కానీ నేను ఇప్పటికీ చిన్నమ్మాయినేనండీ. పద్నాలుగేళ్లకే పరిశ్రమకొచ్చా. ఇప్పుడు పదేళ్ల కెరీర్‌ని పూర్తి చేసుకొన్నా. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











