తమన్నా..ఆనందతాండవం

అలాగే గాంధీకృష్ణ యూత్‌ని, ఫ్యామిలీస్‌ని, క్లాస్‌ని, మాస్‌ని అందర్నీ ఆకట్టుకునేలా ఈ సబ్జెక్టుని బాగా డీల్ చేశాడు. ఎ.ఆర్.రెహమాన్ కజిన్ జి.వి.ప్రకాష్‌కుమార్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. సోనీ బి.ఎం.జి.ద్వారా మార్చి మెదటి వారంలో ఆడియో రిలీజ్ అవుతుంది. పాటలన్ని హైలైట్ అయ్యేలా ఒక్కో పాటకు ఒక్కో డాన్‌స మాస్టర్‌ని పెట్టి చాలా లావిష్‌గా తీశాం. 90 రోజుల పాటు అమెరికాలోఈ చిత్రాన్ని షూటింగ్ చేశాం. మరో 50 రోజులు కులు-మనాలి, కొడైకెనాల్, ఊటీలలో షూటింగ్ జరిపాం.మా బేనర్‌లో ఎన్నో బిగ్గెస్ట్ హిట్స్ వచ్చాయి. ఆ కోవలో ఇది మరో సూపర్ హిట్ చిత్రంగా ఉగాది కానుకగా విడుదల కాబోతుంది" అన్నారు.
ఇంతకుముందు రవిచంద్రన్ ఠాగూర్, అపరిచితుడు, దశావతారం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. తమన్నా హీరోయన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ్‌లో బిజీగా వున్న రుక్మిణి మరో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం ద్వారా సిద్ధార్థ అనే కొత్త హీరో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలయ్యే 'ఆనందతాండవం' చిత్రాన్ని ఎస్.వి.ఆర్.మీడియా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది


Click it and Unblock the Notifications











