తమన్నా...తోచి తోచని కబుర్లు

కొత్త ప్రాజెక్టులు,జరుగుతున్న షెడ్యూల్స్ గురించి చెబుతుందీ అనుకుని ఆమెను షూటింగ్ గ్యాప్ లో కలుసుకున్న వారిని విష్ చేసి "కొంతమందికి పొడవాటి జడ అందాన్నిస్తుంది. మరికొంతమంది పోనీటైల్‌లోనూ చూడముచ్చటగా కనిపిస్తారు. అన్నింటికంటే ముందు జుట్టు సవ్యంగా ఉంటే ఏ స్త్టెల్ అయినా చేసుకోవచ్చు".. అంటూ చెప్పుకొచ్చింది తమన్న.
ఇదే విషయమై ఆమె ఇంకా మాట్లాడుతూ ''చాలా మందికి సొగసైన కేశ సంపద ఉంటుంది. నాదేమో డ్రై హెయిర్. అందుకే ఏ మాత్రం వీలున్నా వెంటనే నూనె పెడతాను. ఎంత మంచి ముఖాకృతి ఉన్నా కేశాలంకరణ కూడా ముఖారవిందంపై ప్రభావాన్ని చూపుతుంది. అందుకే జుట్టు గురించి నేను ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాను. షూటింగ్‌లని పలు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడి నీటి తీరు నా జుట్టుకు సరిపోతుందోలేదోనని మొదట్లో కంగారు పడేదాన్ని కానీ.. ఇప్పుడు నిపుణుల సహాయం తీసుకుంటున్నాను. టెన్షన్ లేకుండా ఉంటున్నాన''ని వివరించింది. ఆహా ఏం చెప్పింది...ఆ రాణీ కేశ పురాణం ...అనుకుంటూ మురిసిపోయి వచ్చారు. ఎందుకంటే అప్పటికే ఆమెకి డైరక్టర్ సార్ నుంచి పిలుపు వచ్చింది.


Click it and Unblock the Notifications











