కడుపు మాడ్చుకొంటున్న తమన్నా!
'జరిగేవన్నీ మంచికనీ అనుకోవడమే మనిషి పనీ.." అన్నారో సినీ కవి. అలా చెప్పారని మన ప్రయత్నం మనం చేయకుండా ఉంటామా ..? కర్తవ్యం మరచిపోతామా? పోం కదా. తమన్నా కూడా అంతే. ఖాళీగా కూర్చోకుండా తన వంతుగా ప్రయత్నాలు చేస్తోంది. 'శుక్రవారం పూజ చేసి ..ఉపవాసం వుటే మంచిది. అన్ని విషయాల్లోనూ మీకు శుభం కలుగుతుంది" అంటూ ఓ కొత్త విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తాలా పోజిచ్చింది. ప్రతి శుక్రవారం ఉపవాస దీక్ష పాటించడం సింధీ అమ్మాయిల ఆచారమట. అందులో భాగంగా తమన్నా కూడా శుక్రవారం వస్తే హడావిడిగా ఉపవాసం పాటించేస్తోంది. 'వారానికి ఒక రోజు తిండి జోలికి పోకుండా కడుపు మాడ్చుకుంటే చాలా మంచిదని డాక్టర్లు చెప్పారు కూడా. సో భక్తి ముక్తీ రెండూ కలిసొస్తాయి" అంటోంది. 'మంచి భర్త వస్తాడనా.." అంటే ముందు నవ్వేసి'అబ్బే ఆశేం లేదు" అని తీరిగ్గా సిగ్గుపడిపోయింది.
More from Filmibeat
తమన్నా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సిద్దార్థ శుక్రవారం ఉపవాసం tamanna koncham istam koncham kastam siddharth


Click it and Unblock the Notifications











