కందిరీగ మాస్ అయితే ‘ఎందుకంటే ప్రేమంటే’ క్లీన్ లవ్..!
'కందిరీగ" సినిమాతో హిట్టు కొట్టిన రామ్, ఇక తమన్నాతో ఆన్ స్క్రీన్ ఇంకా రెచ్చిపోతానంటున్నాడు 'ఎందుకంటే ప్రేమంట" సినిమాలో. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తోన్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం 'ఎందుకంటే ప్రేమంట" సినిమా కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు హీరో రామ్. విదేశాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందనీ, తన కెరీర్ లోనే ఇదో డిఫరెంట్ ఫిలిం అవుతుందనీ రామ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
కరుణాకరన్ తో వర్క్ చేయాలన్నది తన డ్రీమ్..అంటూ సినిమా ప్రారంభోత్సవం నాడే చెప్పిన రామ్, కరుణాకరణ్ తో వర్క్ చేస్తోంటే అస్సలు టైమ్ తెలియదని చెప్పుకొచ్చాడు తాజాగా ఓ సందర్భంలో. 'కందిరీగ" మాస్ సినిమా అయితే, 'ఎందుకంటే ప్రేమంటే" క్లీన్ లవ్ ఎంటర్ టైనర్ అనీ, ఆన్ స్క్రీన్ తమన్నాతో రొమాన్స్ సూపర్బ్ గా వర్కవుట్ అవుతుందని రామ్ చెప్పుకొచ్చాడు. ఇక, హీరోయిన్లను అందంగా చూపించడంలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న కరుణాకరన్, తమన్నాని ఎందుకంటే ప్రేమంట" సినిమా మరింత అందంగా చూపించబోతున్నాడట.


Click it and Unblock the Notifications











