»   » ప్రేక్షకులతో 100% మార్కులేయించుకొంటున్నా తమన్నా...!

ప్రేక్షకులతో 100% మార్కులేయించుకొంటున్నా తమన్నా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హ్యాపీడేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాంటి చిత్రాల్లో చక్కని నటన ప్రదర్శించినా కానీ తమన్నాకి తెలుగు చిత్ర పరిశ్రమలో బ్రేక్ దక్కలేదు. తమిళంలో నటించిన ప్రతి సినిమాతో తన సత్తా చాటుకుంటూ ఉంటే ఆమెని మళ్లీ తెలుగు చిత్ర పరిశ్రమ పిలిచి ఆఫర్లిస్తోంది. 100% లవ్ తోతిరిగి టాలీవుడ్ లో అడుగుపెట్టిన తమన్నా తను ఎంత టాలెంటెడ్ అనే విషయాన్ని రుజువు చేసింది.

మహాలక్ష్మీ పాత్రలో తమన్నా నటనని అంతా ముక్తకంఠంతో మెచ్చుకుంటున్నారు. బద్రీనాథ్, ఊసరవెల్లి లాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్న తమన్నాకి రీఎంట్రీలో ఇలాంటి వార్మ్ వెల్ కమ్ లభించడం ఆమెని తప్పక సంబరాల్లో ముంచెత్తుతుంది. తమిళంలో ఎంత సక్సెస్ అయినా కానీ తెలుగునాట టాప్ కి చేరుకోవాలని తమన్నా చాలా కాలంగా ఆశ పడుతోంది. అందుకే తెలుగులో ఎవరితో ఆఫర్ వచ్చినా నటించేసింది. ఆ ప్రయత్నంలో కొన్ని పరాజయాలు ఎదురై కనుమరుగైంది. కానీ ఈసారి మాత్రం తమన్నా తన కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. అందుకు తగ్గట్టే ఆమెకి భారీ చిత్రాల్లో అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి.

English summary
Tamanna is undoubtedly the life of the project, she looked simply elegant and beautiful. She in-fact went into the skin of the character Maha Lakshmi and her performance in the film is admiring to a large extent. Tamanna is the show stellar in the film and she has lot of scope for performance, she did more than justice to her character.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu