మా పాప...మహేష్ బాబు లైన్లోనే ఉంది!
మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పిబ్రవరి 12వ తేదీనే లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రంలో తమన్నాను అనుకున్నప్పటికీ డేట్స్ కుదరక పోవడం వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని, ఆమె స్థానంలో బెంగుళూరు మోడల్ అక్షర గౌడ్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మహేష్ బాబు సినిమా ఆఫర్‌ను తమన్నా తిరస్కరించిందనే వార్తలను ఆమె తండ్రి ఖండించారు. డేట్స్ విషయంలో కాస్త ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే కానీ, మా పాప ఆ సినిమా ఆఫర్‌ను ఇంకా పరిశీలిస్తోంది అంటున్నారు. మహేష్ బాబు సినిమా చేయాలని నిర్ణయించుకుంది, త్వరలోనే ఈ విషయం ఖరారు అవుతుందని అంటున్నారు.
మహేష్ బాబు-సుకుమార్ కాంబినేషన్లో రూపొందబోతున్న ఈ చిత్రంలో మహేష్ లెక్చరర్ పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నాడు. స్వతహాగా లెక్చరర్ అయిన సుకుమార్ ఈచిత్రాన్ని కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించే యోచనలో ఉన్నాడు. దూకుడు నిర్మాతలు రామ్ ఆచంట, అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంటలు ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. మార్చి చివరి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











