'హ్యాపీడేస్' తో తానేమిటో నిరూపించుకున్న తమన్నా ఇప్పుడు త్రిష ఆఫర్స్ ని తన్నుకుపోతోంది. తాజాగా ఆమె 'జబ్ వుయ్ మెట్' తమిళ వెర్షన్ లో హీరోయిన్ గా బుక్కయింది. ఒరిజనల్ లో కరీనాకపూర్ చేసిన పాత్రను త్రిష కన్నా ఆమె అయితేనే సూటవుతుందని దర్శకనిర్మాతలు హఠాత్తుగా భావించారుట. అసలు మొదట ధనుష్,త్రిష జంటగా ఈ సినిమాని చేయాలని వారు నిర్ణయించుకున్నారు. అయితే మారిన అంచనాలు,క్రేజు,మార్కెట్ తమన్నాని ముందుకు తీసుకొచ్చాయి. అలాగే ధనుష్ ప్లేస్ లోకి ప్రేమిస్తే ఫేమ్ భరత్ వచ్చి చేరాడు. ఈ మార్పు ఇలా ఉంటే తమిళంలో తమన్నా తేలిగ్గా పాగా వేస్తోందని త్రిష కు మరిన్ని ట్విస్ట్ లు ఇవ్వబోతోందని వార్తలు వినపడుతున్నాయి. తమన్నా ప్రస్తుతం గజనీ ఫేమ్ సూర్య తో ఒక సినిమా చేస్తోంది. దానికీ మొదట త్రిషనే అనుకున్నారుట. అదీ సంగతి...