‘ఊసరవెల్లి’కి తమన్నా లాజిక్ తో సూపర్ హిట్ అవుతుందా..?!
అతిరథ మహారాధుల మధ్య అట్లహాసంగా ప్రారంభమైన 'ఊసరవెల్లి" ఆడియోలో మిల్క్ బ్యూటీ తమన్నా సందడి చేసింది. నిన్న జరిగిన ఆడియో ఫంక్షన్ హీరో అయిన దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి మరీ తమన్నా స్టేజ్ మీద చిందులు వేసింది. తమన్నా అలా ఆడియో ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ చూస్తుండిపోయాడు. ఎవరితోనైనా డ్యాన్స్ చేయించగల సత్తా దేవిశ్రీకి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అందులో కొత్తేముంది అనుకుంటున్నారా...
అక్కడే ఉందండి అసలు లాజిక్కు '100% లవ్" సినిమా ఆడియోలో కూడా దేవిశ్రీతో తమన్నా ఇలానే చిందులేసింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా ఇలా డ్యాన్స్ లు చేస్తే సినిమా హిట్ అవుతుందని అనుకున్నట్లుంది తమన్నా..దేవిశ్రీతో రెచ్చిపోయి ఎగిరేసింది. ఇలా డ్యాన్స్ లు చేస్తేనే సినిమా హిట్ అయ్యిందంటే ఇక హీరోయిన్స్ అందరూ అదే పనిలో ఉంటారు..మరి తమన్నా లాజిక్ 'ఊసరవెల్లి"కి ఎంత వరకు సక్సెస్ నిస్తుందో ..చూద్దాం..


Click it and Unblock the Notifications











