‘రెబల్’లో... మతి పోగొడుతున్న తమన్నా...!
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'రెబల్' చిత్రంలో నటిస్తున్న తమన్నా ఈచిత్రంలో హాట్ హాట్‌గా కనిపించనుంది. తాజా ఈచిత్రానికి సంబంధించిన తమన్నా హాట్ లుక్ రిలీజ్ అయింది. సొగసైన ఒంపు సొంపులతో కుర్రాళ్ల మనసును ఇట్టే దోచేస్తున్న తమన్నా అందాలు రెబల్ చిత్రానికి బాగా ప్లస్సవుతాయని ఇట్టే అర్థం అవుతోంది.
బద్రీనాథ్, 100%లవ్ చిత్రాల్లో గ్లామర్‌గా కనిపించిన ఈ బ్యూటీ నాభి అందాలతో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో కూడా తమన్నా బొడ్డుపై లారెన్స్ ప్రయోగాలు చేసినట్లు తెలుస్తోంది.
తమన్నా, దీక్ష సేథ్ లీడ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రంలో రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న లారెన్స్ సంగీతం కూడా తానే స్వయంగా సమకూర్చుకున్నాడు. మార్తాండ్.కె వెంకటేష్ ఎడిటింగ్ పనులు చూసుకుంటుండగా రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేసారు.
మాస్ మసాలా ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రం ప్రభాస్ అభిమానుల టేస్టుకు తగిన విధంగా రూపొందిస్తున్నారు దర్శకుడు లారెన్స్. ఈచిత్రాన్ని జె. పుల్లారావు, జె. భగవాన్ శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 14న 'రెబల్' ఆడియో విడుదల చేసి సెప్టెంబర్ 28న సినిమా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











