తమన్నా... అతన్ని 'హర్రీ పొట్టర్' చేసేసింది(ఫొటో)

By Srikanya

హైదరాబాద్ : మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బల్గేరియాలో బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉంది. అయితే అక్కడ ఆమె హర్రీ పొట్టర్ హీరో డేనియల్ రెడ్ క్లిఫ్ లాంటి కుర్రాడు కనిపించాడు. అయితే అతని కళ్ల జోడు లేదు. దాంతో వెంటనే ఆమె అతని తన కళ్ళజొడు ఇచ్చి హర్రీ పొట్టర్ ని చేసేసి ఇదిగో ఇలా ఫొటో క్లిక్ చేసేసి మన ముందు ఉంచేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ విషయమై తమన్నా ట్వీట్ చేస్తూ... ‘' నేను ఇప్పుడు హర్రీ పొట్టర్ లాంటి అతన్ని కలుసుకున్నాను... అయితే నా కళ్ళజోడు ఇచ్చి అతన్ని పూర్తి హర్రీ పొట్టర్ ని చేసేసాను '' అంది.

బాహుబలి టీం ప్రస్తుతం బల్గేరియాలో షూటింగ్‌ జరుపుకుంటోంది. అక్కడ పదిరోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రభాస్‌, తమన్నాలపై సాంగ్‌ షూట్‌ జరగనుంది. బల్గేరియా షెడ్యూల్‌తో బాహుబలి తుది దశకు చేరుకుంటుంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం 2015 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tamanna made HIM as Harry Potter

తమన్నా ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి' సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం బల్గేరియాలో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఐస్ తో నిండి ఉన్న బల్గేరియాలో జరుగుతున్న షూటింగ్ లో ప్రభాస్, తమన్నా పాల్గొంటున్నారు.

తమన్నా ఈ బల్గేరియా షూట్ లో బాగా ఎంజాయ్ చేస్తోంది. ఆ ఎంజాయ్ మెంట్ లో భాగంగా తమన్నా అక్కడ తీసుకుంటున్న కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను తన ఇంస్టాగ్రం మరియు ట్విట్టర్ అకౌంట్స్ లో పోస్ట్ చేస్తోంది. దీన్ని బట్టి తమన్నా బాహుబలి షూటింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తోన్నట్టు తెలుస్తోంది. రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘బాహుబలి' ఫస్ట్ పార్ట్ 2015 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానంది.

ఈ షెడ్యూల్ తో సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తవుతుంది. ఈ షెడ్యూల్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను త్వరగా కంప్లీట్ చేయనున్నారు. సంగీత దర్శకులు యం.యం.కీరవాణి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి' పార్ట్ 1ను ఏప్రిల్ 17, 2015న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పలు భాషలలో డబ్బింగ్ చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X