రంగులు మార్చే జూ ఎన్టీఆర్ పై చాలా హోప్స్ పెట్టుకొన్న తమన్నా..!
ఒకప్పుడు కోలీవుడ్ లో బిజీ బిజీగా గడిపిన తమన్నా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు. వరుస సినిమాలతో హాట్ హీరోయిన్ గా భాసిల్లుతున్న ఈ ముద్దుగుమ్మ దృష్టంతా ఇప్పుడు ఎన్టీఆర్ 'ఊసరవెల్లి" పైనే వుంది. ఎన్టీఆర్ సరసన తొలిసారిగా నటించిన ఈ చిత్రంలో తన పాత్ర మంచి పేరును తెచ్చిపెడుతుందనే ఆత్మవిశ్వాసంతో వుంది ఈ మిల్కీబ్యూటీ.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు తనది కూడా డిఫంట్ షేడ్స్‌తో రంగులు మార్చే క్యారెక్టరేనని చెప్పుకొస్తుంది ఈ భామ. కాగా తెలుగులో 'శ్రీ"తో కెరీర్ ను మొదలుపెట్టి చిన్న చితకా హీరోలతో నటించిన తమన్నా 'బద్రినాథ్" చిత్రం తనని టాప్ హీరోయిన్ ను చేస్తుందని, 'బద్రినాథ్" రూపంలో పెద్ద కమర్షియల్ సక్సెస్ తన ఖాతాలో చేరుతుందని ఆశపడింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన తమన్నాకు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆమె నటించిన 'ఊసరవెల్లి" ఈ నెల 6న విడుదలవుతుండగా, రామ్ చరణ్ తో నటిస్తున్న 'రచ్చ", ప్రభాస్ తో నటిస్తున్న 'రెబల్" చిత్రాలు సెట్స్ మీద వున్నాయి.


Click it and Unblock the Notifications











