ఇక తమన్నా తాండవం
తమన్నా తల్లితండ్రులు తమ కుమార్తె ప్రేమ వ్యవహారాన్ని అంగీకరిస్తారు. ఆమెను ప్రేమించిన కుర్రాడికే ఇచ్చి పెళ్లి చేస్తామంటారు. ఇంతలో ఆమెకు ఫారిన్ సంబంధం వస్తుంది. వెంటనే ఆమె తల్లి తండ్రుల మాట మార్చేస్తారు. ప్రేమా లేదు ఏమీలేదు..మేం తెచ్చిన సంభంధం చేసుకోమంటారు. ఆ తర్వాత అమెరికాలో ఉండే ఆ అమ్మాయి భారతదేశానికి వచ్చేయాలని కోరుకోవడం... అనంతరం జరిగే సంఘటనల సమాహామే మిగతా కథ. ఒక వేళ మరొకరిని పెళ్లాడినా.. ప్రేమించిన వ్యక్తికి దూరం కావల్సిన పని లేదు.స్నేహాన్ని కొనసాగించవచ్చు అని చెబుతుందీ చిత్రం.
తమిళంలో అపరిచితుడు, రొబొ వంటి అనేక భారీ చిత్రాలుకు కథ అందించిన సుజాత(స్వర్గీయ)రచన ఆధారంగా నిర్మితమవుతున్న ఆనంద తాండవం చిత్రం స్టోరీ లైన్ ఇది. ఈ నెల పదవ తేదీన విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని ఆస్కార్ రవిచంద్రన్ తెలుగు, తమిళ బాషల్లో నిర్మించారు. సున్నితమైన ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు వెన్నెల్లో గోదావరిని చూసిన అనుభూతిని కలిగిస్తుంది. తమన్నా ఈ సినిమాలో ఎంతో బబ్లీగా కనిపిస్తుంది. ఈ సినిమా ద్వారా పరిచయమవుతున్న సిద్ధార్థ భగ్న ప్రేమికుడిగా ప్రశంసనీయమైన నటన ప్రదర్శించారు.
ఈ సున్నితమ ప్రేమ కథ తమన్నా చుట్టూ తిరుగుతుంది. అమెరికాలోని అద్బుతమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో కధాశం అందరికీ నచ్చే అవకాశముందంటున్నారు దర్శక,నిర్మాతలు. ఓ రకంగా తమన్నా నట విశ్వరూపం ఇందులో కన్పడుతుందంటున్నారు.ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జీవాశంకర్, కథ: సుజాత, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, భువనచంద్ర, వనమాలి, సహ నిర్మాత: డి.సురేష్, నిర్మాత: వి.రవిచంద్రన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.గాంధీకృష్ణ.


Click it and Unblock the Notifications











