తమన్నాతో కోరిక తీరిపోతోంది హ్యాపీ...హీరో రామ్
"ఏ హీరోకైనా ఫలానా హీరోయిన్ కావాలి... ఫలానా దర్శకుడితో ఓ సినిమా చేయాలి, ఫలానా సంస్థ చిత్రంలో నటించాలి, ఇలాంటి కొన్ని కోరికలుంటాయి. అవన్నీ నాకు ఈ సినిమాతో తీరిపోతున్నాయి. కరుణాకరన్ అంటే చాలా ఇష్టం. తమన్నాతో 'రెడీ'లో ఓ చిన్న సన్నివేశంలో నటించాను. అప్పటి నుంచీ తనతో కలిసి ఓ సినిమా చేయాలని ఎదురుచూసేవాణ్ని. ఆ అవకాశం ఇప్పుడు దొరికిందంటూ ఉద్వేగంగా చెప్పుకొచ్చారు రామ్. రామ్ హీరోగా శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'ఎందుకంటే... ప్రేమంట'. తమన్నా హీరోయిన్...కరుణాకరన్ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్బంగా రామ్ ఇలా స్పందించారు.
"రెడీ కోసం కేవలం ఒక రోజు షూటింగ్‌లో పాల్గొన్నా. కానీ రామ్, రవికిషోర్‌లాంటి మంచి వ్యక్తుల పరిచయం దొరికింది. వీళ్లతో కలిసి పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంద''ని తమన్నా చెప్పింది. ఇక ముహూర్తపు సన్నివేశానికి విజయభాస్కర్ కె. క్లాప్‌నిచ్చారు. డి.సురేష్‌బాబు స్విచ్ఛాన్ చేశారు. సుకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం రామ్ మాట్లాడుతూదర్శకుడు చిత్రం గురించి చెబుతూ ''కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో చెప్పలేం. ఆ భగవంతుడే కారణం అనుకొంటాం. అలా ఓ అబ్బాయి... అమ్మాయి మధ్య జరిగే విషయాలకు ప్రేమ కారణం అవుతుంది. అదెలాగో సినిమాలో చూడాల్సిందే'' అన్నారు.
సుమన్, రఘుబాబు, రిషి, సాయాజిషిండే, నాగినీడు, సత్యకృష్ణన్, మేల్కోటే, సుమన్‌శెట్టి, జెమిని విజయ్ తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: పి.కృష్ణచైతన్య, మాటలు: కోన వెంకట్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి, కళ: ఎ.ఎస్.ప్రకాష్, ఛాయాగ్రహణం: ఆండ్రూ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్.


Click it and Unblock the Notifications











