»   » యూఎస్ఏ: తమన్నాతో డిసెంబర్ 31 నైట్ పార్టీ

యూఎస్ఏ: తమన్నాతో డిసెంబర్ 31 నైట్ పార్టీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల్లో సినీ తారలకు ఎంత డిమాండ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. డిసెంబర్ 31న రాత్రి జరిగే వేడుకలకు గాను రూ. కోట్లు చెల్లించి మరీ వారితో ఆట పాట ఏర్పాటు చేస్తుంటారు. పలు ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థలు స్టార్ హీరోయిన్లు ముందస్తుగానే బుక్ చేసుకున్నాయి.

యూఎస్ఏకు చెందిన ఓ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ నార్త్ కరోలినాలో జరిగే డిసెంబర్ 31 రాత్రి వేడుకల్లో తమన్నాతో డాన్సింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తమన్నా పేరుతోనే టిక్కెట్ల అమ్మకం సాగిస్తున్నారు. ఒక్కో టికెట్ 89 అమెరికన్ డాలర్లకు అమ్ముతున్నారు. కపుల్ విత్ కిడ్ అయితే 169 డాలర్స్ గా రేటు నిర్ణయించారు.

Tamanna in new year day celebrations

ఇదే విధంగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఇండియన్ కమ్యూటీలను ఆకర్షించేందుకు టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లతో ఆట పాటల కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక డిసెంబర్ నెల మొత్తం అమెరికాతో పాటు, ఇండియాలో ఎక్కడ చూసినా ఇదే హడావుడి కనిపించబోతోంది.

వేడుకల్లో పాల్గొనే సినీ స్టార్ల రేంజిని బట్టి టికెట్ల రేట్లు నిర్ణయిస్తుండటం గమనార్హం. అమెరికాలో మాత్రమే కాదు.... ఇండియాలో కూడా పలు క్లబ్బులు సినీ స్టార్లతో ఎంటర్టెనింగ్ కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా హీరోయిన్లకు ఇలాంటి వేడుకలు భారీగానే కాసులు కురపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నెలల తరబడి షూటింగుల్లో కష్టపడితే వచ్చే ఆదాయం.... డిసెంబర్ 31న ఒకేరోజు వస్తుండటంతో సినీతారలంతా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

English summary
Tamanna will be seen in the new year day celebrations, dancing on the stage, spreading her identical charisma.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu