శ్రీదేవికి మ్యాచ్ కాని తమన్నా... క్రిటిక్స్ రివ్యూస్

By Bojja Kumar

ముంబై: 'హిమ్మత్ వాలా' చిత్రంలో అవకాశం రావడంతో బాలీవుడ్ భవిష్యత్‌పై ఎన్నో అంచనాలు పెట్టుకున్న తమన్నా, అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోతో చేయడం బాగా కలిసొస్తుందని ఆశలు పెట్టుకుంది. కానీ ఆమె అంచనాలు తారుమారయ్యాయి. సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో తమన్నా ఆశలు అడియాశలయ్యాయి.

మార్చి 29న విడుదలైన 'హిమ్మత్ వాలా' చిత్రం బాక్సాఫీసు వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు క్రిటిక్స్ అంతా చాలా తక్కువ రేటింగ్ ఇచ్చారు. ఆడియన్స్ కూడా ఈ సినిమాను తిరస్కరించారు. దర్శకుడి వైఫల్యమో, ఏమో తెలియదు కానీ తమన్నా పెర్ఫామెన్స్‌కు కూడా సరైన మార్కులు రాలేదు. అసలు తమన్నా శ్రీదేవికి మ్యాచ్ కాలేదని, ఒరిజినల్ 'హిమ్మత్ వాలా'లో మాదిరి ఈ రీమేక్ చిత్రంలో తమన్నా శ్రీదేవి గుర్తు తేలేక పోయిందని విమర్శలు వెలువడ్డాయి.

సౌత్‌లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన తమన్నాకు ఈ సినిమా ఫలితం నిజంగా ఊహించని పరిణామమే. తమన్నా అదృష్టం ఏమింటంటే... 'హిమ్మత్ వాలా' సినిమా రిలీజ్ కాకముందే మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. లేకుంటే ఆమెకు ఈ అవకాశం వచ్చి ఉండేదే కాదు. మరి అక్షయ్ కుమార్ తో చేసే సినిమాతో అయినా తమన్నాకు కలిసొస్తుందో లేదో చూడాలి.

శ్రీదేవికి మ్యాచ్ కాని తమన్నా... క్రిటిక్స్ రివ్యూస్

వన్ ఇండియా సినీ విశ్లేషకులు నబనీతా తమన్నా గురించి వ్యాఖ్యానిస్తూ... ‘తమన్నా అందంగానే ఉంది, కానీ ఆమె శ్రీదేవి రేంజిలో ఈ సినిమాలో కనిపించలేదు' అన్నారు.

శ్రీదేవికి మ్యాచ్ కాని తమన్నా... క్రిటిక్స్ రివ్యూస్

రెడిఫ్ నుంచి సుకన్య వర్మ వ్యాఖ్యానిస్తూ.... ‘సినిమాలో అజయ్ దేవగన్, తమన్నా మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదని వ్యాఖ్యానించారు.

శ్రీదేవికి మ్యాచ్ కాని తమన్నా... క్రిటిక్స్ రివ్యూస్

కోయిమోయ్ నుంచి మోహర్ బసు వ్యాఖ్యానిస్తూ ‘తమన్నా పెర్ఫార్మెన్స్ సినిమాకు మైనస్ గా మారింది' అన్నారు.

శ్రీదేవికి మ్యాచ్ కాని తమన్నా... క్రిటిక్స్ రివ్యూస్

డెక్కన్ క్రానికల్ నుంచి ఖలీద్ మహ్మద్ వ్యాఖ్యానిస్తూ... ‘తమన్నా చూడటానికి శ్రీదేవిలా ఉన్నా.... అది తెరపై వర్కౌట్ కాలేదు' అన్నారు.

శ్రీదేవికి మ్యాచ్ కాని తమన్నా... క్రిటిక్స్ రివ్యూస్

అయితే జీటీవీ క్రిటిక్ నుంచి మాత్రం తమన్నాకు ప్రశంసలు అందాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X