»   » హీరోయిన్ తమన్నా ఫ్యామిలీతో ఇలా (ఫోటో)

హీరోయిన్ తమన్నా ఫ్యామిలీతో ఇలా (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ తమన్నాను చాలా సినిమాల్లో చూసాం...ఏ వెబ్ సైట్ చూసినా ఆమె ఫోటోలే.. ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా ఆమె గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఆమె పర్సనల్ లైఫ్ విషయాల గురించి , తమన్నా ఫ్యామిలీ గురించి చాలా తక్కువగా వినిపిస్తుంటాయి, కనిపిస్తంటాయి. సో..ఆ విషయాలపై ఓ లుక్కేద్దాం.

ఇటీవల తమన్నా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లిన సందర్భంగా దిగిన ఫోటో ఒకటి సోషల్ నెట్వర్కింగులో హల్ చల్ చేస్తోంది. ఇందులో తమన్నా తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఉంది. తమన్నా పర్సనల్ విషయాల్లోకి వెళితే....డిసెంబర్ 21, 1989న మహారాష్ట్రలోని ముంబైలో తమన్నా జన్మించింది. తమన్నా తండ్రి పేరు సంతోష్ భాటియా, తల్లి రజనీ భాటియా. ఆమె సోదరుడు ఆనంద్ భాటియా.

ఆమె తండ్రి ఫైనాన్షియల్ కన్సల్టెంట్. చిన్నతనం నుండే హీరోయిన్ కావాలని కలలుగన్న ఆమె తొలుత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆమెకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండటంతో 16 ఏళ్ల వయసులోనే హిందీ మూవీ 'చాంద్ సా రోషన్ చెహ్రా' చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. అయితే ఆ సినిమా ఆడలేదు. ఆ తర్వాత 'శ్రీ' అనే తెలుగు సినిమా ద్వారా సౌత్ లో అడుగు పెట్టిన తమన్నా పలు తమిళ చిత్రాల్లోనూ నటించింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీ డేస్' చిత్రం భారీ విజయం సాధించడంతో తమన్నాకు గురింపు వచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో తమన్నా మహేష్ బాబుతో 'ఆగడు' చిత్రంతో పాటు మరో మూడు తమిళ చిత్రాల్లో నటించింది.

English summary
Tamannaah Bhatia was born on 21 December 1989 in Mumbai, Maharashtra, India, to Santhosh and Rajani Bhatia and she has an elder brother, Anand. Her father is a financial consultant. She is of Sindhi descent.
 
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu