ముద్దు సీన్, బికిని : సెక్సీ తమన్నా ఇక మారదా?
హైదరాబాద్ : హీరోయిన్ తమన్నా సౌత్ లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం బాలీవుడ్లో 'హిమ్మత్ వాలా' చిత్రం చేస్తూ అక్కడ మరిన్ని అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. సౌత్ లో ఎంత రెచ్చిపోయి అందాల ఆరబోత చేసనా...బికిని, ముద్దు సీన్లకు దూరంగానే ఉంటూ వచ్చింది ఈ మిల్కీ బ్యూటీ.
సౌత్‌లో ఉన్నట్లు బాలీవుడ్లోనూ ఉంటానంటే ఎట్టా కుదురుతుంది? అక్కడి సినిమాల్లో ముద్దు సీన్లు, బికినీ సీన్లు సర్వ సాధారణం. ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ లాంటి టాప్ హీరోయిన్లు సైతం సినిమా డిమాండ్ మేరకు అలాంటి సీన్లు చేయాల్సిన పరిస్థితి. లేదంటే బాలీవుడ్లో పోటీ వాతావరణం తట్టుకోవడం కష్టమే.
అయితే తమన్నా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తన పంథా మార్చుకోనంటూ మంకు పట్టుపట్టింది. తన కెరీర్ నేను అనుకున్నట్లుగానే సాగిస్తానని, ఎట్టి పరిస్థితుల్లోనూ బికినీ, ముద్దు సీన్లు చేయనని అంటోంది. అలాంటి సీన్లు చేయాలని పలు అవకాశాలు వస్తున్నా తిరస్కరిస్తున్నానని చెప్పింది.
ప్రేక్షకుల అభిరుచి, కథ డిమాండ్ మేరకు అప్పుడప్పుడు ముద్దు సీన్లు, బికినీ సీన్లు చేయాల్సిందే....ఇవేవీ చేయనని చుట్టూ గిరి గీసుకుని కూర్చుంటే తమన్నా బాలీవుడ్లో నిలదొక్కుకోవడం కష్టమే, మళ్లీ సౌత్ సినిమాలకు తిరుగుటపా కట్టాల్సిందే అని అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.... మరి తమన్నా ఏ చేయబోతోందో చూడాలి?

నేను కొన్ని విషయాల్లో హద్దు దాటకూడదని నిర్ణయించుకున్నాను. అందులో బికినీ, ముద్దు సీన్లు కూడా కటని తమన్నా చెప్పింది.

ఎవరేమనుకున్నా...కొన్ని అవకాశాలు చేజారినా తన పంథా మార్చుకోనంటోంది తమన్నా.

ఎలాంటి పరిస్థితులు ఎదరైనా తన అనుకున్న దారిలోనే నడుస్తానంటోంది తమన్నా.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘హిమ్మత్ వాలా' 1980లో శ్రీదేవి-జితేంద్ర జంటగా వచ్చిన సినిమాకు రీమేక్. మార్చి 29న సినిమా విడుదలవుతోంది.

‘హిమ్మత్ వాలా' చిత్రం తర్వాత తమన్నా అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో చేయబోతోంది.


Click it and Unblock the Notifications











