తమన్నాతో ఎన్టిఆర్

ప్రస్తుతం ఈ టీనేజ్ బ్యూటీ సిధ్ధార్ధ తో కొంచెం ఇష్టంగా ..కొంచెం కష్టంగా గారాలు పోవటానికి కమిటయ్యింది.ఇప్పుడు నటనలోనూ,నాట్యంలోనూ తనదైన ప్రతిభ చూపుతూ దూసుకుపోతున్న ఎన్టీఆర్ ప్రక్కన అవకాసం రావటం అదృష్టమే. దాంతో వీరి కాంబినేషన్ యే కొత్త రికార్డులకు దారితీస్తుందో అని అభిమానులు ఆలోచనలో పడుతున్నారు.నిజానికి ఇదంతా ఆమె హ్యాపీడేస్ లో చూపిన ప్రతిభ ప్రభావమే.కాని కొందరు ఆమె డిప్రెషన్ లో ఉన్నప్పుడు నమ్మిన న్యూమిరాలిజినే లైఫ్ ఇస్తోందని ప్రచారం చేస్తున్నారు.వారు చెప్పే ప్రకారం ఆమె ఈ మధ్య పేరులో కొన్ని అక్షరాలు మార్చుకోవటం వల్ల వచ్చిన ఫలితమేనని అంటున్నారు.ఇవన్నీ ఎలా ఉన్నా తమన్నా ఇప్పుడు లక్కీ గర్ల్.


Click it and Unblock the Notifications











